సూపర్‌స్టార్ సింహనాదం…’దర్బార్’కు హిట్ టాక్..

తలైవా ‘దర్బార్’తో దుమ్మురేపాడు. బొమ్మ బ్లాక్‌బాస్టర్ అంటూ థియేటర్స్ నుంచి రిపోర్ట్ అందుతోంది. సౌత్‌లో ఉన్న రజనీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. పాలాభిషేకాలు చేస్తూ, టపాసులు కాలస్తూ సంబరాల్లో మునిగిపోయారు. పొంగల్ బరిలో అందరికంటే ముందొచ్చిన సూపర్‌స్టార్ సిల్వర్ స్క్రీన్‌పై సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. వాస్తవానికి ‘దర్బార్’ రిలీజ్‌కి ముందే పాజిటీవ్ బజ్ క్రియేట్ చేసింది. ఏఆర్ మురగదాస్ ఫుల్ మీల్స్‌గా సినిమాను తయారుచేసి ఫ్యాన్స్‌పైకి బాణంలా విసిరాడు. అందుకే ఈ రిజల్ట్. ఇప్పటికే ప్రిమియర్స్‌తో […]

సూపర్‌స్టార్ సింహనాదం...'దర్బార్'కు హిట్ టాక్..
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 09, 2020 | 1:38 PM

తలైవా ‘దర్బార్’తో దుమ్మురేపాడు. బొమ్మ బ్లాక్‌బాస్టర్ అంటూ థియేటర్స్ నుంచి రిపోర్ట్ అందుతోంది. సౌత్‌లో ఉన్న రజనీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. పాలాభిషేకాలు చేస్తూ, టపాసులు కాలస్తూ సంబరాల్లో మునిగిపోయారు. పొంగల్ బరిలో అందరికంటే ముందొచ్చిన సూపర్‌స్టార్ సిల్వర్ స్క్రీన్‌పై సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. వాస్తవానికి ‘దర్బార్’ రిలీజ్‌కి ముందే పాజిటీవ్ బజ్ క్రియేట్ చేసింది. ఏఆర్ మురగదాస్ ఫుల్ మీల్స్‌గా సినిమాను తయారుచేసి ఫ్యాన్స్‌పైకి బాణంలా విసిరాడు. అందుకే ఈ రిజల్ట్. ఇప్పటికే ప్రిమియర్స్‌తో పాటు కొన్ని మల్టిప్లెక్స్‌లో ఫస్ట్ షోస్‌ కూడా కంప్లీట్ అయ్యాయి. అసలు సౌత్ ఇండియాలో ఉండే వారికి రజనీ సినిమా రిలీజ్ అప్పుడు సిట్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అదే మూవీకి హిట్ టాక్ వస్తే..ఇక రచ్చ రంబోలానే.

కాగా తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని కంపెనీలు తలైవా ‘దర్బార్’ రిలీజ్ సందర్భంగా జనవరి 9న ఉద్యోగులకు సెలవు ప్రకటించాయి. బెంగుళూరుకు చెందిన ఓపస్ వాటర్ ప్రూపింగ్, తమిళనాడుకు చెందిన ఫైండస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. మరికొన్ని కంపెనీలు అయితే తమ ఉద్యోగులకు ఉచితంగా టికెట్లను కూడా అందించాయి. కాగా ‘దర్బార్’‌ లో రజనీకి జోడిగా లేడీ సూపర్‌స్టార్ నయన్ నటించింది. అనిరుద్ సంగీతం అందించాడు. ఏది ఏమైనా..మూవీ హిట్ టాక్‌తో రజనీ ఫ్యాన్స్‌ ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.