నయన్‌తో బ్రేకప్ వార్తలు.. విఘ్నేష్ శివన్ ఏం చేశాడంటే..!
మళ్లీ ప్రేమలో విఫలమైన నయనతార.. మూడోసారి నయన్ బ్రేకప్.. విఘ్నేష్ శివన్‌ను వద్దనుకున్న నయనతార.. ఈ పుకార్లు ఈ మధ్య కాలంలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే ఈ గాసిప్ రావడానికి కారణం కూడా ఉంది. మామూలుగా ప్రతి ఈవెంట్‌ను విఘ్నేష్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకునేది నయన్. అంతేకాదు ఈ ఇద్దరు కలిసి ఎన్నో దేవాలయాలు కూడా చుట్టి పూజలు కూడా చేయించుకున్నారు. అలాంటిది కొత్త సంవత్సర వేడుకలు మాత్రం అతడు లేకుండానే జరుపుకుంది నయన్. దానికి తోడు […]
మళ్లీ ప్రేమలో విఫలమైన నయనతార.. మూడోసారి నయన్ బ్రేకప్.. విఘ్నేష్ శివన్‌ను వద్దనుకున్న నయనతార.. ఈ పుకార్లు ఈ మధ్య కాలంలో ఒక్కసారిగా గుప్పుమన్నాయి. అయితే ఈ గాసిప్ రావడానికి కారణం కూడా ఉంది. మామూలుగా ప్రతి ఈవెంట్‌ను విఘ్నేష్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకునేది నయన్. అంతేకాదు ఈ ఇద్దరు కలిసి ఎన్నో దేవాలయాలు కూడా చుట్టి పూజలు కూడా చేయించుకున్నారు. అలాంటిది కొత్త సంవత్సర వేడుకలు మాత్రం అతడు లేకుండానే జరుపుకుంది నయన్. దానికి తోడు ఆ తరువాత జరిగిన ఓ అవార్డు వేడుకకు సైతం ఆమె ఒంటరిగా వెళ్లింది. దీంతో గాసిప్‌లు మొదలయ్యాయి. అయితే వీటన్నింటికి చెక్ పెట్టేందుకు విఘ్నేష్ శివన్ రంగంలోకి దిగారు.
నయన్ సింగిల్ ఫొటోను, ఆమెతో తాను తీసుకున్న ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు విఘ్నేష్. అంతేకాదు తాను, నయన్ ఉన్న ఫొటోను ప్రొఫైల్ ఫొటోగా పెట్టుకున్నారు విఘ్నేష్. దీంతో ఏం చెప్పకుండానే బ్రేకప్ పుకార్లకు చెక్ పెట్టారు. కాగా విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన నానుమ్ రౌడీదాన్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది నయన్. అప్పటి నుంచి ఈ ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే గతంలో శింబు, ప్రభుదేవాలతో నయన్‌కు బ్రేకప్ జరిగిన విషయం తెలిసిందే.
https://www.instagram.com/p/B7BG3ilh5b8/
https://www.instagram.com/p/B7BG0GEBQYG/