Prabhas : తొలి సినిమాతోనే క్రేజ్.. కట్ చేస్తే.. ప్రభాస్‌ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల రాజాసాబ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మిక్డ్స్ రివ్యూస్ వస్తున్నాయి. మరోవైపు చేతినిండా సినిమాలతో డార్లింగ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదెలా ఉంటే.. ప్రభాస్ ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఈశ్వర్ సినిమాతో హీరోగా సినీప్రయాణం స్టార్ట్ చేసి.. పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన తీరు గురించి చెప్పక్కర్లేదు. ఛత్రపతి, డార్లింగ్, మిర్చి వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్న ప్రభాస్ కెరీర్ బాహుబలి సినిమాతో మలుపు తిరిగింది. బాహుబలి 1,2 సినిమాలతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ మూవీస్ తర్వాత ప్రభాస్ నటించే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్.. ఇటీవల సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 9న రాజాసాబ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ్స్ వస్తున్నాయి.
ఇదెలా ఉంటే… ప్రభాస్ కు ఉండే ఫాలోయింగ్ గురించి తెలిసిందే. సామాన్యులే కాకుండా సెలబ్రెటీస్ సైతం ప్రభాస్ అంటే పడి చచ్చిపోతుంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ , అమ్మాయలకు రాకుమారుడిగా మారిపోయాడు. ప్రభాస్ సరసన కథానాయికగా నటించాలనుకుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ప్రభాస్ ను అన్న అని పిలిచిన ఏకైక హీరోయిన్ ఎవరో మీకు తెలుసా.. ? ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది.
ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..
జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనదైన నటనతో మెప్పించింది. ఇదెలా ఉంటే.. గతంలో ఫరియా అబ్దుల్లా ఓ బుల్లితెర కార్యక్రమానికి హాజరైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె..యాంకర్ శ్రీముఖి, ఆటో రాంప్రసాద్ ఓ ప్రశ్న అడిగారు. మకు ఇష్టమైన హీరో ఎవరు అని అడగ్గా.. ప్రభాస్ అన్న అంటూ చెప్పుకొచ్చింది. దీంతో శ్రీముఖి షాకైంది. వెంటనే నీకు ప్రభాస్ అన్న.. నాకు జస్ట్ ప్రభాస్ అంటూ కామెంట్స్ చేసింది.
అప్పట్లో ఫరియా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. జాతిరత్నాలు తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆ స్థాయిలో క్రేజ్ మాత్రం రాలేదు. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‌కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..
