AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi: ఆ సినిమా కోసం నన్నే అడిగారు.. కానీ నేను చేయను అని చెప్పా.. అనిల్ రావిపూడి కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకు విభిన్న కంటెంట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్.. ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారు మూవీతో అలరిస్తున్నారు. జనవరి 12న ఈ మూవీ అడియన్స్ ముందుకు వచ్చింది.

Anil Ravipudi: ఆ సినిమా కోసం నన్నే అడిగారు.. కానీ నేను చేయను అని చెప్పా.. అనిల్ రావిపూడి కామెంట్స్..
Jaya Nayagan, Anil Ravipudi
Rajitha Chanti
|

Updated on: Jan 12, 2026 | 10:26 AM

Share

తెలుగు సినిమా ప్రపంచంలో తక్కువ సమయంలోనే తనదైన ముద్ర వేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటివరకు కమర్షియల్ సక్సెస్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. పటాస్, సంక్రాంతికి వస్తున్నాం వంటి సూపర్ హిట్స్ తర్వాత ఇప్పుడు ఆయన రూపొందించిన సినిమా మన శంకరవరప్రసాద్ గారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన సినిమా జనవరి 12న సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమాకు ఉదయం నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తనను విజయ్ దళపతి చివరి సినిమాకు దర్శకత్వ వహించమన్నారని.. కానీ తను కొన్ని కారణాల వల్ల ఒప్పుకోలేదని అన్నారు. “విజయ్ గారు స్వయంగా నన్ను సంప్రదించారు. తన చివరి సినిమాను డైరెక్టర్ చేయాలని కోరారు. అది నాకు గౌరవంగా అనిపించింది. అదే సమయంలో భగవంత్ కేసరి సినిమా గురించి మాట్లాడారు. ఆ మూవీని తనకు నచ్చిందని..అందుకే గతంలో ఆ కథను రీమేక్ చేయాలనే ఆలోచనతో తన దగ్గరకు వచ్చారు. “అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

కానీ విజయ్ చివరి సినిమా కావడం.. అది రిమేక్ అయితే అభిమానులు ఎలా తీసుకుంటారో అనే భయం కారణంగా ఆ సినిమా చేయలేకపోయానని అన్నారు. అందుకే స్ట్రైట్ సినిమా చేయాలని మాత్రమే అనుకున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..