వంటలక్క ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ‘కార్తీక దీపం’కు త్వరలో ముగింపు..!
సీరియల్స్‌నందు ‘కార్తీక దీపం’ వేరయా.. ఇప్పుడు ఇదే అంటున్నారు బుల్లితెర వీక్షకులు. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటోన్న వంటలక్క సీరియల్‌ను మిస్ చేసుకోవాలని ఆమె అభిమానులు ఎవ్వరూ అనుకోరు. రాత్రి గం.7.30ని.లు అయ్యిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ఇళ్లలోని టీవీల్లో కార్తీక దీపం కనిపిస్తుంటుంది. అంతేకాదు స్టార్ హీరోల హిట్టు సినిమాలు కూడా.. టీఆర్పీ రేటింగ్‌లో వంటలక్కతో పోటీపడలేకపోతున్నాయి. అలాంటి కార్తీక దీపం గురించి ఇటీవల కొన్ని పుకార్లు వస్తున్నాయి. అదేంటంటే త్వరలోనే కార్తీక దీపంకు […]
సీరియల్స్‌నందు ‘కార్తీక దీపం’ వేరయా.. ఇప్పుడు ఇదే అంటున్నారు బుల్లితెర వీక్షకులు. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటోన్న వంటలక్క సీరియల్‌ను మిస్ చేసుకోవాలని ఆమె అభిమానులు ఎవ్వరూ అనుకోరు. రాత్రి గం.7.30ని.లు అయ్యిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ఇళ్లలోని టీవీల్లో కార్తీక దీపం కనిపిస్తుంటుంది. అంతేకాదు స్టార్ హీరోల హిట్టు సినిమాలు కూడా.. టీఆర్పీ రేటింగ్‌లో వంటలక్కతో పోటీపడలేకపోతున్నాయి. అలాంటి కార్తీక దీపం గురించి ఇటీవల కొన్ని పుకార్లు వస్తున్నాయి. అదేంటంటే త్వరలోనే కార్తీక దీపంకు శుభం కార్డు పడనుందని. 700 ఎపిసోడ్‌లో దీప, కార్తీక్‌లను కవలలు కలిపేస్తారని ఆ తరువాత సీరియల్ ముగుస్తుందని గాసిప్‌లు వినిపిస్తున్నాయి. దీంతో వంటలక్క ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనవుతున్నారు.
అయితే వాటిలో నిజం లేదని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కథ మంచి ట్విస్ట్‌లతో నడుస్తోంది. కార్తీక్(నిరుపమ్) తన తండ్రి అని సౌర్య(దీప కూతురు)కు ఈ మధ్యనే తెలిసింది. దీంతో తన తల్లిదండ్రులను ఎలాగైనా కలపాలని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు హిమ(దీప రెండో కూతురు) తల్లి ఎవరో కూడా కనుగొనే ప్రయత్నాల్లో సౌర్య ఉంది. ఇక హిమ సైతం తన తండ్రికి(డాక్టర్ బాబు), దీపకు పెళ్లి చేయాలని దృఢ నిశ్చయంతో ఉంది. ఈ పిల్లల ప్రయత్నాలు ఇలా సాగుతుంటే కార్తీక్‌ను, దీపలను విడదీసి.. అతడిని పెళ్లాడాలని మౌనిత ఎత్తుగడలు వేస్తూనే ఉంది.
ఇలాంటి నేపథ్యంలో ఇంకా కథ చాలానే ఉంది. వంటలక్క(దీప)నే తన తల్లి అన్న నిజం హిమకు తెలియాలి. అలాగే సౌర్యకు నిజం తెలిసిందన్న విషయం కార్తీక్(డాక్టర్ బాబు)కు తెలియాలి. దీంతో పాటు దీప ఏ తప్పు చేయలేదని కార్తీక్ నమ్మాలి. వీటితో పాటు మౌనిత చేస్తోన్న దారుణాలు కూడా కార్తీక్‌కు తెలియాలి. ఇవన్నీ తేలాలంటే చాలా కష్టమే. అలాగే ఎలాగూ మన తెలుగు సీరియల్స్‌కు చాలా కాలం నడుస్తాయి కాబట్టి.. కార్తీక దీపంకు ఇప్పట్లో శుభం పడే అవకాశం లేదని తెలుస్తోంది. సో వంటలక్క ఫ్యాన్స్ మీరేం టెన్షన్ పడక్కర్లేదు.