AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pongal: డేట్, టైమ్.. ప్రధాన సాంప్రదాయ వంటకాలు, స్టార్టప్స్ పూర్తి మెనూ ఇలా

Pongal: మకర సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండగ. తమిళనాడు, కేరళ, కర్ణాటకతోపాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ వివిధ పేర్లతో సంక్రాంతిని జరుపుకుంటున్నారు. మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండగ సందర్భంగా కొన్ని ప్రత్యేక వంటకాలు చేస్తుంటారు. ప్రాంతాలవారీగా వారి సాంప్రదాయాల ప్రకారం రుచికరమైన వంటకాలు చేసుకుని ఆరగిస్తారు. వాటి గురించి తెలుసుకుందాం.

Pongal:  డేట్, టైమ్.. ప్రధాన సాంప్రదాయ వంటకాలు, స్టార్టప్స్ పూర్తి మెనూ ఇలా
Pongal Foods
Rajashekher G
|

Updated on: Jan 12, 2026 | 10:57 AM

Share

మకర సంక్రాంతి పండగ అనేది భారతదేశంలో వివిధ పేర్లతో జరుపుకుంటారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మకర సంక్రాంతి, పొంగల్ తదితర పేర్లతో పెద్ద పండగగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను మూడు రోజులపాటు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజులు ప్రత్యేక కార్యక్రమాలతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజులు ప్రత్యేక వంటకాలను కూడా చేస్తారు. తమిళంలో సంక్రాంతిని ‘పొంగల్’ అనే పేరుతో జరుపుకుంటారు. పొంగల్ అంటే ఉడకబెట్టడం లేదా పొంగడం అని అర్థం.

పొంగల్ జనవరి 14న ప్రారంభమై జనవరి 17న ముగుస్తుంది. ద్రిక్ పంచాంగం ప్రకారం.. థాయ్ పొంగల్ అని జనవరి 14న మధ్యాహ్నం 3.13 గంటలకు ప్రారంభమవుతుంది. నాలుగు రోజుల పండగలో కుటుంబాలు, బంధువులు, అతిథులు కలిసి సాంప్రదాయ వంటకాలతో విందు భోజనం చేస్తారు. వాటిలో ముఖ్యమైన వంటకాల గురించి తెలుసుకుందాం.

సాంప్రదాయ పొంగల్ వంటకాలు

స్టార్టప్స్

వడ

ఆకలి పుట్టించే అద్భుతమైన వంటక వడ. దీన్ని నల్ల పప్పుతో తయారు చేస్తారు. కొబ్బరి చట్నీ లేదా సాంబార్‌తో తింటే బాగా రుచిగా ఉంటుంది. బయటి నుంచి క్రిస్పీ-క్రంచీగా, లోపల నుంచి మెత్తగా ఉండే ఈ బంగారు వడలను డీప్ ఫ్రై చేస్తారు. అనేక పోషకాలు కలిగి ఉండటంతో ఇది ఆరోగ్యమైన స్టార్టర్‌గా చెప్పవచ్చు.

మీన్ వఝుక్కై చాప్స్

చేపలు, అరటిపండుతో తయారు చేసిన ఈ ప్రత్యేక ఆకలి పుట్టించే వంటకం చాలా క్రిస్పీగా ఉంటుంది. దీనికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు జోడిస్తారు. ఈ ముక్కలను సాధారణంగా ఉల్లిపాయలు, కరివేపాకు, కొబ్బరితో వడ్డిస్తారు. కొబ్బరికాయల రుచితోపాటు నిమ్మరసం కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. సాంప్రదాయ రుచి కోసం అరటి ఆకుపై దీన్ని వడ్డిస్తుంటారు.

వేరుశనగ సుండల్

దక్షిణ భారత శైలిలో చేసే వేరుశెనగ చాట్ లాగా బాగుంటుంది. కరివేపాకు, కొబ్బరి తురుముతోపాటు కొన్ని నిమిషాల్లోనే ఈ వంటకం తయారవుతుంది. కానీ, రుచిలో మాత్రం అద్భుతంగా ఉంటుంది.

ప్రధాన వంటకాలు

వెన్ పొంగల్

ఎంతో రుచికరమైన ఈ వెన్ పొంగల్‌ను.. బియ్యం, పప్పుల మిశ్రమంతో తయారు చేస్తారు. వండిన అన్నం, పప్పును కలిపి మెత్తగా చేసి కొద్దిగా నీరు, ఉప్పు వేస్తారు. ఒక చెంచా నెయ్యి కూడా వేస్తారు. ఈ ఆహారం వేడి వేడిగా తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇది మంచి పోషకాహారం కూడా.

సాంబర్

సాంబార్‌కు తమిళనాడు పెట్టింది పేరు. అందుకే పొంగల్ రోజున కూడా సాంబర్ వంటకం ప్రత్యేకంగా ఉంటుంది. సాంబార్ ఇతర ఆహార పదార్థాలతో కలిపి తింటే మరింత రుచిని ఇస్తుంది. సాంబార్ పొడి, చింతపండు పేస్ట్, నీరు, ఇతర పోపు పదార్థాలతో సాంబార్ తయారు చేస్తారు. పండగ భోజనానికి ఈ సాంబార్ మరింత రుచిని జోడిస్తుంది.

రసం

పొంగల్ రోజు మరో రుచికరమైన వంటకం రసం. కారంగా, ఉప్పగా ఉండే ఈ రసం వారి వారి అభిరుచులకు అనుగుణంగా తయారు చేసుకుంటారు. ఈ రసాన్ని అన్నంతో జత చేయడం ఎంతో రుచిని తెస్తుంది. కొందరు రుచిలో వైవిధ్యం కోసం నిమ్మరసం లేదా పైనాపిల్ రసం తీసుకుంటారు.

బీన్స్ పోరియల్

పచ్చి బఠానీలు, సుగంధ ద్రవ్యాలు, కరివేపాకు, తురిమిన కొబ్బరితో తయారు చేయబడిన మరో రుచికరమైన వంటకం బీన్స్ పోరియల్. తేలికైన వంట పద్ధతి, నూనె తక్కువగా ఉపయోగించడం, పోషకాహారం అధికంగా ఉండే పదార్థాల కారణంగా ఆరోగ్య ప్రియులకు ఇది మంచి ఆహారంగా ప్రసిద్ధి చెందింది.

తీపి వంటకాలు

సక్కరై పొంగల్

సంక్రాంతికి ప్రత్యేక తీపి పదార్థాలను కూడా తయారు చేసుకుంటారు. పెసరపప్పు, బెల్లం, నెయ్యి, గింజలు ఉపయోగించి తయారు చేసిన సక్కరై పొంగల్‌ను మీ జాబితాలో చేర్చండి. దీనిని దక్షిణ భారత శైలి పెసరపప్పు హల్వాగా చెప్పవచ్చు.

పాయసం

క్రిమీగా రుచికరంగా ఉండే దీనిని బియ్యం, పాలతో తయారు చేస్తారు. ఈ డిజర్ట్ జీడిపప్పు, ఎండు ద్రాక్షలు జత చేస్తే మరింత రుచికరంగా మారుతుంది. ఈ పాయసం ఎంతో రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే చకినాలతోపాటు అనేక పిండి వంటలు చేసి పండగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా
ముస్తాఫిజుర్ ని తీసేస్తే.. మొత్తానికే ఎసరు పెట్టారుగా
టచ్‌ చేయకుండానే కుప్పకూలిన సైన్యం.. వెనిజులాపై దాడిలో..
టచ్‌ చేయకుండానే కుప్పకూలిన సైన్యం.. వెనిజులాపై దాడిలో..
శుక్ర సంచారం.. ఈ రాశుల వారికి 13 నుంచి శుభ ఫలితాలు
శుక్ర సంచారం.. ఈ రాశుల వారికి 13 నుంచి శుభ ఫలితాలు