Virat Kohli : గ్రౌండ్లో కింగ్ స్నేక్ డ్యాన్స్..గ్లెన్ ఫిలిప్స్ అవుటయ్యాక విరాట్ వినూత్న సెలబ్రేషన్
Virat Kohli : వడోదరలో జరిగిన భారత్-న్యూజిలాండ్ తొలి వన్డేలో టీమ్ ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ విజయం కంటే కూడా విరాట్ కోహ్లీ చేసిన ఒక ఫన్నీ సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Virat Kohli : వడోదరలో జరిగిన భారత్-న్యూజిలాండ్ తొలి వన్డేలో టీమ్ ఇండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ విజయం కంటే కూడా విరాట్ కోహ్లీ చేసిన ఒక ఫన్నీ సెలబ్రేషన్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. మైదానంలో ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండే కోహ్లీ, కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ అవుటైన సమయంలో స్నేక్ చార్మర్ అవతారం ఎత్తి చేసిన డాన్స్ అభిమానులను కడుపుబ్బ నవ్విస్తోంది.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 34వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ వేసిన బంతిని గ్లెన్ ఫిలిప్స్ షాట్ ఆడబోయి పాయింట్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయ్యర్ అద్భుతమైన డైవ్‌తో ఆ క్యాచ్‌ను పట్టుకున్నాడు. వెంటనే కోహ్లీ అయ్యర్ దగ్గరకు వెళ్లి, ఒక స్నేక్ చార్మర్ నాగస్వరం ఊదుతున్నట్లుగా సైగలు చేస్తూ.. అయ్యర్‌ను పాములా డాన్స్ చేయమని సరదాగా ఆటపట్టించాడు. గతంలో కూడా కోహ్లీ ఇలాంటి ఫన్నీ స్టెప్పులతో అలరించినప్పటికీ, ఈ స్నేక్ చార్మర్ యాక్ట్ మాత్రం నెక్స్ట్ లెవల్‌లో ఉందంటున్నారు నెటిజన్లు.
THE CELEBRATION OF VIRAT KOHLI WHEN KULDEEP GETS PHILLIPS. 😂
– King Kohli, What a character!#ViratKohli #INDvNZ #INDvsNZ pic.twitter.com/tTwRJRk5wA
— AB Crickzone (@BInformati71086) January 11, 2026
ఈ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌కు దిగకముందే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కోహ్లీ అధిగమించాడు. గంగూలీ భారత్ తరఫున 308 వన్డేలు ఆడగా, ఈ మ్యాచ్ కోహ్లీకి 309వ వన్డే. తద్వారా భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఐదో ప్లేయర్‌గా కోహ్లీ నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (463) అగ్రస్థానంలో ఉన్నారు.
బ్యాట్‌తోనూ కోహ్లీ పరుగుల వరద పారించాడు. ఈ మ్యాచ్‌లో 93 పరుగులు చేసిన విరాట్, అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా చేరుకున్న బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలో మూడో ప్లేయర్‌గా (సచిన్, సంగక్కర తర్వాత), రెండో భారతీయుడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. 624 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించిన కోహ్లీ, సచిన్ టెండూల్కర్ (644 ఇన్నింగ్స్‌లు) రికార్డును కూడా బద్దలు కొట్టడం విశేషం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
