Andhra: కోరుకున్న అమ్మాయి ఒంటరిగా రమ్మంది.. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది.. అతడు వెళ్లగా..
ఇన్ స్టాలో పరిచయమైన అమ్మాయిని కోరుకున్నాడు.. ఆమె ఇష్టం గురించి పట్టించుకోకుండా వేదించాడు. ఓ రోజు ఆమె.. ఇతడిని ఒంటరిగా ఊరు చివరికి రమ్మంది. పాపం.! వెళ్లాడు.. అక్కడ ఏదో అనుకుంటే.. ఇంకేదో అయ్యింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చెక్ చేయండి.

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ఇన్‌స్టా ద్వారా పరిచయం అయిన యువకుడు యువతిని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేయడంతో.. వేధింపులు భరించలేని యువతి స్నేహితులతో కలసి యువకుడిని చంపి కాల్వలో పడేసిన ఘటన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కలకలం రేపింది. హత్యకు పాల్పడిన యువతి స్నేహితుడైన మణికంఠ అనే యువకుడిని అరెస్టు చేయగా.. మైనర్లు అయిన యువతి, మరో ఇద్దరి జువైనల్ హొంకు తరలించారు. ముద్దాయిల నుంచి నేరానికి ఉపయోగించిన ఆటో, ఒక సెల్‌ఫోన్‌తో పాటు చనిపోయిన వ్యక్తి బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇది చదవండి: ట్రాఫిక్ తప్పించుకోవాలా.? హైదరాబాద్ టూ విజయవాడ ఈ ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లండి.!
వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా గడివేముల గ్రామానికి చెందిన వినోద్ అనే యువకుడు మెడికల్ ల్యాబ్ టెక్నిషన్ చదువుతున్నాడు. అతనికి నంద్యాలలో నివాసం ఉండే ఓ మైనర్ యువతితో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఇద్దరి రోజు ఇన్ స్టాగ్రాంలో చాటింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మృతుడు వినోద్ నీ కులం నా కులం ఒకటే ఇద్దరం కలుస్తాం అంటు వేధించడం మొదలు పెట్టాడు.ఇలా రోజు మానసికంగా, శారీరకంగా వేధించడంతో భరించలేని యువతి అమె స్నేహితులకి విషయం తెలిపింది. యువతి స్నేహితుడైన మణికంఠ మరో ఇద్దరు మైనర్లు.. వినోద్‌ను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. ముందే వేసుకున్న పథకం ప్రకారం.. వినోద్‌ను గడివేముల శివారులోని రమ్మని పిలిచారు. ముందే అనుకున్న ప్రకారం వినోద్‌ను ఆటోలో ఎక్కించుకునిపోయి అందరూ కలిసి బలంగా కొట్టారు. దీంతో కుప్పకూలిపోయి.. పడిపోయిన వినోద్ చనిపోయాడని నిర్థారించుకుని సమీపంలోని కాల్వలో పడేశారు. అ తర్వాత ఎవరికి వారు వెళ్ళిపోయారు.
మృతుడు తండ్రి రాజు కొడుకు కనిపించకపోవడంతో గత సంవత్సరం ఆగష్టు 31న కొడుకు కనిపించడం లేదని గడివేముల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినోద్ ఆచూకీ కోసం ఎంత గాలించినా లభించలేదు. వినోద్ కాల్ లిస్ట్ అధారంగా యువతిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి. ముద్దాయిలు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు గాలించగా.. పాణ్యం శివారులోని గాలేరునగరి కాల్వలో మృతుడు వినోద్ బైక్ లభించింది. వినోద్ మృతదేహం కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. యువతీ యువకులు అనుమానిత వ్యక్తులతో ఫేస్‌బుక్ ఇన్‌స్టాలో పరిచయాలు చేసుకోవడం సరైంది కాదని, సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇది చదవండి: బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో నటించింది.. కానీ చిరంజీవితో మాత్రం.! కారణం చెప్పేసిన టాలీవుడ్ హీరోయిన్




