Mana Shankara VaraPrasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ రెమ్యునరేషన్స్.. ఎవరెవరు ఎంత తీసుకున్నారంటే?
సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 12) మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి పెర్ఫామెన్స్ కు అందరూ ఫిదా అవుతున్నారు. చాలా రాజుల తర్వాత వింటేజ్ మెగాస్టార్ ను చూశామంటూ కామెంట్స్ వస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా ‘ మన శంకర వరప్రసాద్ గారు ’. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కింంచిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. అలాగే విక్టరీ వెంకటేష్ మరో కీ రోల్ లో మెరిశాడు. సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 12)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది. మెగాస్టార్ పెర్ఫామెన్స్, డ్యాన్సులు, దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్, వెంకీ క్యామియో రోల్, నయనతార స్క్రీన్ ప్రజెన్స్, పాటలు.. ఇలా ఈ సినిమాలో పాజిటివ్ అంశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత వింటేజ్ చిరంజీవిని చూశామని మెగాభిమానులు సంబరపడుతున్నారు. కాగా ఈ సినిమాలో భారీ తారగణమే ఉంది. క్యాథరీన్ థెరీసా, సచిన్ ఖేడ్కర్, హర్షవర్ధన్, శరత్ సక్సేనా, హర్షవర్ధన్, రఘుబాబు, అభినవ్ గోమఠం.. ఇలా చాలామంది నటులే ఉన్నారు.
మన శంకర వరప్రసాద్ గారు సినిమా కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తోన్న నేపథ్యంలో ఇందులో నటించిన స్టార్స్ రెమ్యునరేషన్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి సుమారు రూ.70 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాకు వెంకటేష్ గెస్ట్ రోల్ కూబా బాగా హెల్ప్ అయ్యింది. సినిమాలో ఆయన సుమారు 20 నిమిషాల పాటు కనిపించనున్నారు. ఇందుకోసం సుమారు రూ.9 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్లు టాక్. ఇక నయనతార రూ. 6 కోట్లు, దర్శకుడు అనిల్ రావిపూడి రూ. 20 కోట్ల పారితోషికం తీసుకున్నారని సమాచారం.
బ్లాక్ బస్టర్ రెస్పాన్స్..
MEGA BLOCKBUSTER RESPONSE from PREMIERES WORLDWIDE 💥💥💥#ManaShankaraVaraPrasadGaru Raffadinchesaru 😎🔥#MSG GRAND RELEASE TODAY IN CINEMAS ❤️🔥
Book your tickets now for the BIGGEST FAMILY ENTERTAINER OF SANKRANTHI 2026 🎟️ pic.twitter.com/VouzBvL5e5
— Shine Screens (@Shine_Screens) January 11, 2026
Director @AnilRavipudi deserves full credit for bringing back classic comedy by understanding Megastar @KChiruTweets and Victory @VenkyMama perfectly. This is vintage entertainment presented with absolute clarity and confidence. 👏#ManaShankaraVaraPrasadGaru pic.twitter.com/ijGVPY2zTE
— Bunny Vas (@TheBunnyVas) January 12, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .




