Vijay Hazare Trophy : 25 ఫోర్లు, 21 సిక్సర్లతోఏకంగా 303 పరుగులు..ఇప్పుడేమో వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్
Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీలో సెన్సేషనల్ ఫామ్‌లో ఉన్న ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ దురదృష్టవశాత్తూ గాయపడ్డాడు. కర్ణాటకతో జరుగుతున్న అత్యంత కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు అతను తప్పుకోవాల్సి రావడం ముంబై జట్టును కలవరపెడుతోంది.

Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీలో సెన్సేషనల్ ఫామ్‌లో ఉన్న ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ దురదృష్టవశాత్తూ గాయపడ్డాడు. కర్ణాటకతో జరుగుతున్న అత్యంత కీలకమైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు అతను తప్పుకోవాల్సి రావడం ముంబై జట్టును కలవరపెడుతోంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి బలంగా తగలడంతో అతని వేలు విరిగింది. సర్ఫరాజ్ లేని లోటు ముంబై బ్యాటింగ్ లైన్-అప్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు తడబడటం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ముంబై జట్టు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో సాయిరాజ్ పాటిల్ వేసిన బంతిని ఎదుర్కొంటుండగా, సర్ఫరాజ్ వేలికి బంతి బలంగా తాకింది. నొప్పి తీవ్రంగా ఉండటంతో వెంటనే పరీక్షలు నిర్వహించగా.. వేలు విరిగినట్లు తేలింది. దీంతో డాక్టర్లు అతనికి విశ్రాంతి అవసరమని సూచించారు. కీలకమైన నాకౌట్ మ్యాచ్ సమయంలో ఇలా జరగడం ముంబై టీమ్ ప్లాన్స్‌ను పూర్తిగా దెబ్బతీసింది.
గాయపడక ముందు వరకు సర్ఫరాజ్ ఈ సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 ఇన్నింగ్స్‌లలో 190.56 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 303 పరుగులు చేశాడు. ఇందులో 25 ఫోర్లు, 21 సిక్సర్లు ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది, లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఇంతటి భీకరమైన ఫామ్‌లో ఉన్న ఆటగాడు జట్టులో లేకపోవడం ముంబైకి పెద్ద మైనస్.
సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో ముంబై మేనేజ్మెంట్ ఓపెనర్ ఈషాన్ మూల్‌చందానీని జట్టులోకి తీసుకుంది. అయితే సర్ఫరాజ్ రేంజ్‌లో అతను మెరుపులు మెరిపించలేకపోయాడు. క్వార్టర్ ఫైనల్‌లో 32 బంతులు ఎదుర్కొన్న ఈషాన్ కేవలం 20 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో ముంబై జట్టు కష్టాల్లో పడింది. సర్ఫరాజ్ ఉండి ఉంటే మ్యాచ్ స్వరూపమే వేరేలా ఉండేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
