షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలో తెలుసుకోండి
షట్టిల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పూజించడం వల్ల ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయి. షట్టిల ఏకాదశి అనేది విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి ఒక ప్రత్యేక సందర్భంగా పరిగణించబడుతుంది. అయితే, ఈరోజున కొన్ని తప్పులు చేయడం వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. షట్టిల ఏకాదశినాడు చేసే కొన్ని తప్పులు శాపాలుగా మారతాయిన చెబుతారు. అందుకే ఈరోజన చేయవలసిన, చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం.

సనాతన ధర్మంలో ప్రతీ ఏకాదశికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ తిథి విశ్వ రక్షకుడైన మహా విష్ణువుకు అంకితం చేయబడింది. సంవత్సరంలో 24 ఏకాదశి తిథులు ఉన్నాయి. మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని షట్తిల లేదా షట్టిల ఏకాదశి అని అంటారు. ఈ రోజున ఉపవాసంతోపాటు విష్ణువు, లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఉపవాసం పాటించడం వల్ల అన్ని పాపాల నుంచి విముక్తి లభిస్తుందని మత విశ్వాసం.
షట్టిల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి పూజించడం వల్ల ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయి. షట్టిల ఏకాదశి అనేది విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి ఒక ప్రత్యేక సందర్భంగా పరిగణించబడుతుంది. అయితే, ఈరోజున కొన్ని తప్పులు చేయడం వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. షట్టిల ఏకాదశినాడు చేసే కొన్ని తప్పులు శాపాలుగా మారతాయిన చెబుతారు. అందుకే ఈరోజన చేయవలసిన, చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం.
షట్టిల ఏకాదశి శుభ సమయం
వేద పంచాంగం ప్రకారం.. మాఘ మాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తిథి జనవరి 13న మధ్యాహ్నం 3.17 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి జనవరి 14న సాయంత్రం 4.52 గంటలకు ముగుస్తుంది. అందుకే, షట్టిల ఏకాదశి ఉపవాసం జనవరి 14న పాటిస్తారు. అంటే షట్టిల ఏకాదశి మకర సంక్రాంతితో సమానంగా ఉంటుంది.
షట్టిల ఏకాదశినాడు ఈ దోషాలు నివారించండి
అన్నం తినకూడదు ఏకాదశినాడు బియ్యం తినడం నిషిద్ధమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈరోజున బియ్యంతో చేసిన పదార్థాలను తీసుకుంటే.. తదుపరి జీవితంలో సరీసృపంగా పునర్జన్మ పొందుతారని నమ్ముతారు. ముఖ్యంగా షట్టిల ఏకాదశి నాడు ధాన్యాలు, బియ్యాన్ని తినకూడదు.
తులసి ఆకులను కోయవద్దు విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టం. అందుకే, ఏకాదశినాడు తులసి ఆకులను కోయడం మహా పాపంగా పరిగణిస్తారు. పూజకు తులసి ఆకులు అవసరమైతే ఏకాదశికి ఒక రోజు ముందు వాటిని కోయవచ్చు.
తామసిక వస్తువులు తినవద్దు షట్టిల ఏకాదశినాడు పొరపాటున కూడా తామస ఆహారాలను తినవద్దు. అలా చేయడం వల్ల ఇంటి శాంతి, ఆనందం నాశనం అవుతుందని నమ్ముతారు. ఈ రోజున మనస్సు, శరీరం రెండింటినీ పవిత్రంగా ఉంచుకోవాలి.
పెద్దలను అగౌరవపర్చవద్దు ఏకాదశి ఉపవాస సమయంలో ఇతరులను విమర్శించకూడదు. ఈరోజున చెడు ఆలోచనలు మనస్సులోకి ప్రవేశిస్తే.. ఉపవాసం యొక్క శుభ ఫలితాలు రద్దు అవుతాయని చెబుతారు. ముఖ్యంగా ఈరోజున అబద్ధం చెప్పడం మానుకోవాలి. ఈ రోజున పెద్దలను అవమానించకూడదు.
షట్టిల ఏకాదశి రోజున ఏం చేయాలి?
షట్టిల ఏకాదశి నాడు ఉదయం సూర్య భగవానుడికి ప్రార్థనలు చేయండి. విష్ణువు, లక్ష్మీదేవిని పూజించండి. ఇంట్లో పూజ ముగిసిన తర్వాత ఆలయానికి వెళ్లి దేవతలను దర్శించుకోండి. పేదలకు దానం చేయండి. భగవంతుడికి ఇష్టమైన ఆహార పదార్థాలను అందించండి. ద్వాదశి తిథినాడు ఉపవాసం విరమించండి. పగటిపూట భజనలు, కీర్తనలలో పాల్గొనండి. మీ ఇల్లు, పూజా మందిరం యొక్క పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.
Note: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. TV9తెలుగు దీనిని ధృవీకరించదు.
