Tollywood: ఈ టాలీవుడ్ సీనియర్ నటి గుర్తుందా? ఇప్పుడామె మనవరాలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. ఎవరో తెలుసా?
సీనియర్ నటీనటుల సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ వారి కుమారులు, కుమార్తెలు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. తమదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోన్న ఈ హీరోయిన్ ఒకప్పుడు ప్రముఖ నటి ప్రభ మనవరాలే.

ప్రభ అలియాస్ కోటి సూర్య ప్రభ.. ఇప్పటి తరానికి ఈ నటి గురించి పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ 70-80 స్ ఆడియెన్స్ మాత్రం ఆవిడను ఇట్టే గుర్తు పడతారు. సైడ్ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అందాల తార ఆ తర్వాతి కాలంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, కృష్ణంరాజు వంటి పెద్ద హీరోల సరసన నటించిందీ అందాల తార. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వందకు పైగా సినిమాల్లోనూ ఈమె యాక్ట్ చేసింది. దేవతలారా దీవించండి, జగన్మోహిని, ఆమెకథ, ఇంటింటి రామాయణం, ఇదెక్కడి న్యాయం, కోరికలే గుర్రాలయితే, పార్వతీ పరమేశ్వరులు, సంధ్యారాగం, నేను-మా ఆవిడ, సంతోషీమాత వ్రత మహాత్మ్యం, మనిషికో చరిత్ర, శ్రీవినాయక విజయం తదితర సినిమాలు ప్రభకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. కాగా ఇప్పటికీ సినిమాలు, సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంటోందీ అందాల తార. ముఖ్యంగా కిక్ సినిమాలో రవితేజ తల్లిగా ప్రభ నటన అందరినీ ఆకట్టుకుంది. అలాగే ‘కలిసుంటే కలదు సుఖం’ సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైందీ అందాల తార. ఇదిలా ఉంటే ప్రభ మనవరాలు కూడా ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అన్న విషయం చాలా మందికి తెలియదు. ఇటీవలే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? మరికొన్ని గంటల్లో భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ఆడియెన్స్ ముందుకు రానున్న డింపుల్ హయాతి. అవును.. ఈ విషయాన్ని డింపులే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది.
‘ మా నానమ్మ పేరు ప్రభ. హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేశారు. ఎన్టీఆర్ తోనూ అప్పట్లో ‘దానవీర శూరకర్ణ’లో నటించారు. తెలుగుతో పాటు మలయాళంలోనూ మూవీస్ చేశారు. మా నానమ్మ ప్రభ.. ‘కిక్’ సినిమాలో రవితేజకు తల్లి పాత్ర చేసింది. ఆ టైంలోనే నా ఫొటోని దర్శకుడు సురేందర్ రెడ్డికి చూపించడంతో ఇలియానా చెల్లి పాత్ర కోసం అడిగారు. అప్పుడు నేను ఇంకా నాలుగో తరగతి చదువుతున్నాను. ఇప్పుడే సినిమాల్లోకి ఎందుకు? అని ఇంట్లో వాళ్ల వద్దనేశారు. ఆ తర్వాత చాలా బాధపడ్డారు. రవితేజతో ‘ఖిలాడి’ చేస్తున్నప్పుడు ఆయనకు కూడా ఈ విషయం చెప్పాను’ అని డింపుల్ హయాతి చెప్పుకొచ్చింది.
డింపుల్ హయాతీ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
కాగా ప్రభాస్ నటించిన రాఘవేంద్ర, రెబల్ చిత్రాల్లో నూ ప్రభ కీలక పాత్రలు పోషించింది. ఇక డింపుల్ విషయానికి వస్తే.. గల్ఫ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైందీ. ఆ తర్వాత గద్దల కొండ గణేష్ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఖిలాడీ, రామబాణం సినిమాల్లో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ఇప్పుడు రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలోనూ కథానాయికగా యాక్ట్ చేసింది. సంక్రాంతి కానుకగా మంగళవారం (జనవరి 13) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .




