AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: రైలులో ట్రాన్స్‌జెండర్‌ ముందు వెక్కి వెక్కి ఏడ్చిన యువకుడు.. ఆమె చేసిన పనికి ప్రశంసలు!

Indian Railways: కొందరు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి మనిషి మంచివాడు కానట్లే, ప్రతి ట్రాన్స్‌జెండర్ చెడ్డవారు కాదు అని, ఈ ప్రపంచంలో కూడా మంచి వ్యక్తులు ఉన్నారు అని కామెంట్‌ చేస్తున్నారు. దేవుడు మనుషులకు సహాయం చేయడానికి ట్రాన్స్‌జెండర్‌లను..

Viral News: రైలులో ట్రాన్స్‌జెండర్‌ ముందు వెక్కి వెక్కి ఏడ్చిన యువకుడు.. ఆమె చేసిన పనికి ప్రశంసలు!
Transgender Helped
Subhash Goud
|

Updated on: Jan 12, 2026 | 2:04 PM

Share

Viral News: రైళ్లలో ప్రయాణించేటప్పుడు ట్రాన్స్‌జెండనర్లు తరచుగా ప్రజలను ఇబ్బంది పెట్టడం చూసే ఉంటారు. వారు డబ్బు కోసం ఇబ్బంది పెడుతుంటారు. ఈ సమస్య పెద్ద, చిన్న నగరాల్లో కనిపిస్తుంది. అయితే ఇటీవల ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తి రైలులో చేసిన పనికి అందరు ప్రశంసిస్తున్నారు. ఈ సంఘటన బీహార్‌లో జరిగిందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో రెండు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఒకదానిలో ఒక ప్రయాణికుడు రైలులో ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తి ముందు ఏడుస్తున్నట్లు కనిపిస్తుంది. రెండవదానిలో ఒక ట్రాన్స్‌జెండర్ వ్యక్తి తన పర్సును తెరిచి ఉంచినట్లు కనిపిస్తుంది. ఒక యువకుడు ఒంటరిగా సీటుపై కూర్చుని, నిశ్శబ్దంగా, విచారంగా ఉన్నాడు. అకస్మాత్తుగా ఒక ట్రాన్స్‌జెండర్ అతని వద్దకు వచ్చి డబ్బు డిమాండ్ చేశారు. ఆమె అతని తలపై చేయి వేసింది. ఆ బాలుడు “నా దగ్గర డబ్బు లేదు, నేను రెండు రోజులుగా తినలేదు” అని చెబుతూ ఏడవడం మొదలు పెట్టాడు.

ఇది చూసిన ఆ ట్రాన్స్ జెండర్ మహిళ ఆ బాలుడిని, “ఎందుకు ఏడుస్తున్నావు? నా దగ్గర డబ్బు తీసుకుని తినడానికి వెళ్ళు” అని చెప్పింది. ఈ సమయంలో ఆ ట్రాన్స్ జెండర్ మహిళ తన పర్సు తెరిచి కొంత డబ్బు తీసి అతనికి ఇస్తుంది. ఇది చూసిన ఆ బాలుడు ఏడుస్తూ, డబ్బు తీసుకోవడానికి నిరాకరించాడు. కానీ ఆ ట్రాన్స్ జెండర్ మహిళ నిరాకరించి, డబ్బును అతని చేతిలోకి బలవంతంగా అందించింది. నవ్వుతూ ఈ రోజు మా ప్రార్థనలు నీకు తోడుగా ఉంటాయి అని కూడా తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. ప్రజలు ఆ ట్రాన్స్ జెండర్ మహిళను ప్రశంసిస్తున్నారు. అయితే ఇండియన్ రైల్వేస్ ఈ వైరల్ ఫోటోను ధృవీకరించలేదు.

ఇది కూడా చదవండి: Metro Fare Hike: ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?

ఇవి కూడా చదవండి

దీనిపై కొందరు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి మనిషి మంచివాడు కానట్లే, ప్రతి ట్రాన్స్‌జెండర్ చెడ్డవారు కాదు అని, ఈ ప్రపంచంలో కూడా మంచి వ్యక్తులు ఉన్నారు అని కామెంట్‌ చేస్తున్నారు. దేవుడు మనుషులకు సహాయం చేయడానికి ట్రాన్స్‌జెండర్‌లను పంపాడు కానీ ప్రజలు వారిని తప్పు దృష్టితో చూస్తారు.. వారు కూడా మనుషులే అని మరో నెటిజన్‌ వ్యాఖ్యానించాడు.

ఇది కూడా  చదవండి: Cauliflower Cleaning: కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌.. ఇలా చేస్తే వెంటనే బయటకు వస్తాయి!

Vande Bharat Sleeper: ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంటుందో తెలుసా?

రైలులో ట్రాన్స్‌జెండర్‌ ముందు ఏడ్చిన యువకుడు..ఆమె చేసిన పనికి..
రైలులో ట్రాన్స్‌జెండర్‌ ముందు ఏడ్చిన యువకుడు..ఆమె చేసిన పనికి..
Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు!
Chanakya Niti: ఈ రెండు గుణాలుంటే మీరు జీవితంలో ఓడిపోరు!
వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..
వీరికి నిమ్మకాయ విషంతో సమానం.. దూరం పెట్టకపోతే నేరుగా అక్కడికే..
సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
సామాన్యుడిని కూడా కోటీశ్వరుడిగా చేయొచ్చు..!
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
ఈ 6 పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్‌లో ఉంచకండి..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
అచ్చ తెలుగమ్మాయి.. హీరోయిన్ మెటీరియల్ బాసూ.. ఎవరంటే..
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
ఆ మెట్రో ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. టికెట్ ధరలు పెరుగుతాయా?
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?