పాకిస్తానీ ‘క్వాడ్ కాఫ్టర్’ ని కూల్చివేసిన ఇండియన్ ఆర్మీ

జమ్మూ కాశ్మీర్ లోని కెరన్ సెక్టార్ లో గూఢచర్యం నెరపడానికా అన్నట్టు ఎగురుతున్న పాకిస్తానీ క్వాడ్ కాప్టర్ ని భారత సైన్యం శనివారం కూల్చివేసింది. ఇది చైనాలో తయారైనదని సైనికవర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనిక శిబిరాల మీద దాడులు జరపడానికి పాక్ బోర్డర్ యాక్షన్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందడంతో ఇండియన్ ఆర్మీ సదా అప్రమత్తంగా ఉంటోంది. శీతాకాలం రాకముందే ఉగ్రవాదులను దొంగచాటుగా కాశ్మీర్ లోకి పంపాలని పాకిస్తాన్ పన్నాగం పన్నుతోంది. […]

పాకిస్తానీ 'క్వాడ్ కాఫ్టర్' ని కూల్చివేసిన ఇండియన్ ఆర్మీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 24, 2020 | 5:51 PM

జమ్మూ కాశ్మీర్ లోని కెరన్ సెక్టార్ లో గూఢచర్యం నెరపడానికా అన్నట్టు ఎగురుతున్న పాకిస్తానీ క్వాడ్ కాప్టర్ ని భారత సైన్యం శనివారం కూల్చివేసింది. ఇది చైనాలో తయారైనదని సైనికవర్గాలు తెలిపాయి. వాస్తవాధీన రేఖ వద్ద భారత సైనిక శిబిరాల మీద దాడులు జరపడానికి పాక్ బోర్డర్ యాక్షన్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం అందడంతో ఇండియన్ ఆర్మీ సదా అప్రమత్తంగా ఉంటోంది. శీతాకాలం రాకముందే ఉగ్రవాదులను దొంగచాటుగా కాశ్మీర్ లోకి పంపాలని పాకిస్తాన్ పన్నాగం పన్నుతోంది. దీన్ని పసిగట్టిన భారత జవాన్లు నిరంతరం అలర్ట్ గా ఉంటున్నారు. పాక్ కు చైనా వత్తాసు పలుకుతున్నదనడానికి ఈ క్వాడ్ కాఫ్టర్ నిదర్శనమని అంటున్నారు.