AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళలో దారుణం.. కరోనా రోగిని కట్టేసి చికిత్స అందించిన సిబ్బంది

కేరళలో దారుణం జరిగింది. కరోనా సోకిన వృద్ధురాలి చేతిని కట్టేశాడు ఓ శాడిస్టు వైద్యుడు. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారడంతో చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రికి లేఖ రాసారు ప్రతిపక్ష పార్టీ నేతలు

కేరళలో దారుణం.. కరోనా రోగిని కట్టేసి చికిత్స అందించిన సిబ్బంది
Balaraju Goud
|

Updated on: Oct 24, 2020 | 5:32 PM

Share

కేరళలో దారుణం జరిగింది. కరోనా సోకిన వృద్ధురాలి చేతిని కట్టేశాడు ఓ శాడిస్టు వైద్యుడు. ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారడంతో చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రికి లేఖ రాసారు ప్రతిపక్ష పార్టీ నేతలు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కేరళకు చెందిన ఒక కుటుంబంలోని ఆరుగురికి ఇటీవల కరోనా సోకింది. దీంతో కుటుంబ సభ్యులను కేరళలోని పలు ఆస్పత్రులకు తరలించి కరోనా చికిత్స అందించారు.

అయితే, ఆ కుటుంబంలోని 67 ఏండ్ల వృద్ధురాలికి కరోనా వల్ల మానసిక వైకల్యం సంభవించింది. దీంతో ఆమెను కరోనా కేంద్రం నుంచి ఈ నెల 20న త్రిస్సూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ వృద్ధురాలిని చూసేందుకు వెళ్లిన బంధువులు ఆమె పరిస్థితి చూసి షాక్‌ అయ్యారు. వృద్ధురాలిని మంచానికి తాళ్ల బంధించారు. అంతేకాదు నేలపై పడటంతో తలకు గాయాలయ్యాయి. తోటి రోగులు దీనిని వీడియో తీశారు. కాగా ఆస్పత్రి సిబ్బంది 1తీరుపై వృద్ధురాలి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

కాగా, దీనిపై స్పందించిన కాంగ్రెస్‌ ఎంపీ ప్రతాపన్‌… కేరళ ఆరోగ్య మంత్రి శైలజాకు లేఖ రాశారు. త్రిస్సూర్‌ మెడికల్‌ కాలేజీలో మానసిక వైద్యులు లేనప్పటికీ ఆమెను అక్కడికి ఎందుకు తరలించి చికిత్స అందిస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు మెడికల్‌ కాలేజీ దవాఖాన అధికారులు దీనిపై వివరణ ఇచ్చారు. సెలైన్‌ ఎక్కించే కాన్యులాను ఆమె తొలగిస్తుండటంతో చేతిని కట్టినట్లు తెలిపారు. మంచం పైనుంచి ఆమె కిందపడటం దురదృష్టకరమని చెప్పారు. తలకు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయంటూ ఆరోగ్య మంత్రికి వివరణ ఇచ్చారు.

Follow Us
మీ ఏజ్‌ను బట్టి మీరు రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసా..?
మీ ఏజ్‌ను బట్టి మీరు రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసా..?
ఇక వీరు రైల్వే టికెట్స్‌ బుక్‌ చేసుకోలేరు.. భారీ షాకిచ్చిన IRCTC
ఇక వీరు రైల్వే టికెట్స్‌ బుక్‌ చేసుకోలేరు.. భారీ షాకిచ్చిన IRCTC
ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు!
ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు!
రామ్ చరణ్ 'పెద్ది'సినిమాకు రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రామ్ చరణ్ 'పెద్ది'సినిమాకు రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కంపెనీ బంపర్ ఆఫర్..సిగరెట్ తాగని ఉద్యోగులకు 6 రోజులు అదనపు సెలవు!
కంపెనీ బంపర్ ఆఫర్..సిగరెట్ తాగని ఉద్యోగులకు 6 రోజులు అదనపు సెలవు!
టీ షర్ట్‌‌లో T అంటే ఏంటో తెలుసా..? దీని వెనుకున్న కథ తెలిస్తే..
టీ షర్ట్‌‌లో T అంటే ఏంటో తెలుసా..? దీని వెనుకున్న కథ తెలిస్తే..
టీమిండియా టీ20 జట్టు.. కెప్టెన్‌గా శ్రేయాస్.. వైభవ్ ఎంట్రీ
టీమిండియా టీ20 జట్టు.. కెప్టెన్‌గా శ్రేయాస్.. వైభవ్ ఎంట్రీ
ఈ రెండు బ్యాంకులపై షాకిచ్చిన ఆర్బీఐ.. భారీ జరిమానా.. కారణం ఇదే!
ఈ రెండు బ్యాంకులపై షాకిచ్చిన ఆర్బీఐ.. భారీ జరిమానా.. కారణం ఇదే!
ఇది షిప్ కాదు,సముద్రంపై తేలియాడే అద్భుత నగరం! 80 వేల మంది జనాభాతో
ఇది షిప్ కాదు,సముద్రంపై తేలియాడే అద్భుత నగరం! 80 వేల మంది జనాభాతో
హైదరాబాద్‌లో అక్రమ ఫార్మా నెట్‌వర్క్ బట్టబయలు.. DCA దాడుల్లో..
హైదరాబాద్‌లో అక్రమ ఫార్మా నెట్‌వర్క్ బట్టబయలు.. DCA దాడుల్లో..