IND vs ENG: టీమిండియా టీ20 కెప్టెన్‌గా ‘సర్పంచ్ సాబ్’.. వైస్ కెప్టెన్‌గా తెలుగోడు.. ఎంట్రీ ఇచ్చిన వైభవ్..
భారత క్రికెట్ అభిమానులకు సరికొత్త జోష్ ఇచ్చేలా ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం బీసీసీఐ సరికొత్త టీ20 జట్టును ప్రకటించింది. యువ రక్తం, అనుభవజ్ఞుల కలయికతో కూడిన ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనుండగా, వైస్ కెప్టెన్‌గా మన తెలుగు తేజం తిలక్ వర్మ ఎంపికై సంచలనం సృష్టించాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తొలిసారి భారత జట్టులో చోటు దక్కింది.

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ ఎంపిక కమిటీ ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం సరికొత్త టీ20 జట్టును ప్రకటించింది. ఈ పర్యటనలో మొదటగా ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడిన అనంతరం, ఇంగ్లాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం భారత జట్టు అక్కడకు పయనం కానుంది. ‘సర్పంచ్ సాబ్’ శ్రేయస్ అయ్యర్ ఈ జట్టును ముందుండి నడిపించనున్నాడు. మరోవైపు, అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హైదరాబాద్ కుర్రాడు, తెలుగు రాష్ట్రాల గర్వకారణం తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం విశేషం. ఈ నిర్ణయంతో తెలుగు క్రికెట్ అభిమానుల్లో ఆనందం వెల్లువలా కురుస్తోంది.
వైభవ్ సూర్యవంశీకి దక్కిన అద్భుత అవకాశం.. ప్రిన్స్ యాదవ్‌కు చోటు..
ఈ జట్టు ఎంపికలో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత జట్టులో చోటు దక్కడం. ఇటీవల తన అసాధారణమైన బ్యాటింగ్ శైలితో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్‌కు ఇది చాలా పెద్ద బ్రేక్ అని చెప్పవచ్చు. అతనితో పాటు దేశవాళీ క్రికెట్‌లో, ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్న యువ ఆటగాడు ప్రిన్స్ యాదవ్‌ను కూడా సెలెక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. యువకులకు పెద్దపీట వేస్తూ భవిష్యత్తు జట్టును నిర్మించే ప్రణాళికలో భాగంగానే సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
తెలుగు కుర్రాళ్లు నితీష్, సిరాజ్‌లతో కలిపి పటిష్టమైన బలగం..
Presenting #TeamIndia‘s T20I squads for the tours of England & Ireland 2026 🇮🇳#ENGvIND | #IREvIND pic.twitter.com/f84kSSAIDf
— BCCI (@BCCI) June 6, 2026
వైస్ కెప్టెన్‌గా ఎంపికైన తిలక్ వర్మతో పాటు మరో తెలుగు ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అలాగే హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ మహ్మద్ సిరాజ్ బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నాడు. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లకు చోటు లభించింది. అభిషేక్ శర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ వంటి పవర్‌ఫుల్ ఆల్‌రౌండర్లతో భారత జట్టు ఎంతో సమతుల్యంగా కనిపిస్తోంది. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ మాయ చేయనుండగా, పేస్ బాధ్యతలను హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ పంచుకోనున్నారు.
Here’s a look at #TeamIndia‘s squad for the Asian Games 2026 in Japan this September 👏#AsianGames pic.twitter.com/euMfmhWEcN
— BCCI (@BCCI) June 6, 2026
సారథిగా శ్రేయస్ అయ్యర్ అనుభవం, మన తెలుగోడు తిలక్ వర్మ దూకుడు కలసి జట్టుకు కొండంత బలాన్ని ఇస్తాయనడంలో సందేహం లేదు. కొత్తగా జట్టులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్ వంటి యువ ఆటగాళ్లు విదేశీ గడ్డపై ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లను వారి సొంత గడ్డపై మట్టికరిపించి ఈ యువ భారత్ సరికొత్త చరిత్ర సృష్టించాలని క్రికెట్ ప్రేమికులు ఆకాంక్షిస్తున్నారు.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20ల కోసం భారత జట్టు..
శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ, ప్రిన్స్ యాదవ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
