AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది షిప్ కాదు.. సముద్రంపై తేలియాడే అద్భుత నగరం! 80 వేల మంది జనాభా, సొంత ఎయిర్‌పోర్ట్‌తో సరికొత్త రికార్డు!

సముద్రంపై ఒక సంపూర్ణ నగరం తేలియాడే విప్లవాత్మక భావనతో ఫ్రీడమ్ షిప్ (Freedom Ship) ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల కంటే ఎక్కువ వ్యయంతో రూపుదిద్దుకోనున్న ఈ మెగా షిప్ పొడవు 1.3 కిలోమీటర్లు (సుమారు ఒక మైలు). ఇందులో ఒకేసారి 80,000 మంది ప్రజలు ప్రశాంతంగా నివసించవచ్చు. ఈ భారీ నౌకపై విమానాశ్రయం (Airport), ఆసుపత్రులు, పాఠశాలలు, మాల్స్ మరియు క్రీడా మైదానాలు వంటి ఆధునిక నగర సదుపాయాలన్నీ ఉంటాయి. ఈ తేలియాడే నగరం ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రపంచాన్ని చుట్టి వస్తుంది.

ఇది షిప్ కాదు.. సముద్రంపై తేలియాడే అద్భుత నగరం! 80 వేల మంది జనాభా, సొంత ఎయిర్‌పోర్ట్‌తో సరికొత్త రికార్డు!
Freedom ShipImage Credit source: facebook
Jyothi Gadda
|

Updated on: Jun 06, 2026 | 1:17 PM

Share

సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించే సముద్రపు తేలియాడే నగరాలు త్వరలోనే నిజం కాబోతున్నాయి. అమెరికాకు చెందిన ఫ్రీడమ్ క్రూయిజ్ లైన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద నివాస నౌక ఫ్రీడమ్ షిప్ (Freedom Ship) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. దాదాపు 16 బిలియన్ డాలర్ల (సుమారు ఒక లక్ష కోట్ల రూపాయల పైమాట) భారీ బడ్జెట్‌తో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్ట్, మానవ చరిత్రలోనే అత్యంత భారీ ఇంజనీరింగ్ అద్భుతంగా నిలవనుంది.

ఫ్రీడమ్ షిప్ అనేది సాధారణ విహార నౌక (Cruise Ship) కాదు, ఇది సముద్రంపై నిరంతరం ప్రయాణించే ఒక స్వయంసమృద్ధ నగరం. ఈ నౌక పొడవు 1.3 కిలోమీటర్లు (దాదాపు ఒక మైలు), ఎత్తు 25 అంతస్తులు ఉంటుంది. ప్రస్తుత ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ అయిన ఐకాన్ ఆఫ్ ది సీస్ కంటే ఇది దాదాపు ఎనిమిది రెట్లు పెద్దదిగా ఉండబోతోంది. ఇందులో 50,000 శాశ్వత నివాస గృహాలతో పాటు హోటళ్లు, క్యాసినోలు కూడా నిర్మిస్తారు. ఈ నౌకలో ఏకకాలంలో 50,000 మంది నివాసితులు, 30,000 మంది సందర్శకులు, సిబ్బందితో కలిపి మొత్తం 80,000 మంది సులభంగా నివసించవచ్చు.

ఈ ప్రాజెక్ట్ అత్యంత ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, ఈ ఓడ పైకప్పు (Roof) పై చిన్న వాణిజ్య, ప్రైవేట్ విమానాలు ల్యాండ్ అవ్వడానికి వీలుగా ఒక రన్‌వే కలిగిన విమానాశ్రయం ఉంటుంది. దీని ద్వారా నివాసితులు ప్రపంచంలోని ఏ దేశానికైనా సులభంగా ప్రయాణించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇక, ఈ ఓడలోని వసతులు చూస్తే.. ఒక ఆధునిక నగరంలో ఉండే అన్ని సౌకర్యాలు ఈ ఓడలోనే అందుబాటులో ఉంటాయి. పిల్లల కోసం అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు, కళాశాలలు నిర్మించనున్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన భారీ ఆసుపత్రి. 15,000 సీట్ల సామర్థ్యం గల స్పోర్ట్స్ స్టేడియం, షాపింగ్ మాల్స్, థియేటర్లు. ఓడ లోపల తిరగడానికి 15 మైళ్ల పొడవైన వాక్‌వేస్, అంతర్గత ట్రామ్ (Tram) వ్యవస్థతను ఏర్పాటు చేయనున్నారు.

న్యూక్లియర్ ఎనర్జీతో నడిచే ఈ సూపర్ షిప్ అంతర్జాతీయ జలాల్లో ఉంటూ ప్రతి రెండేళ్లకు ఒకసారి ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఇది ఏ దేశ ఓడరేవులోనూ ఆగదు, ఎందుకంటే దీని పరిమాణం చాలా పెద్దది. ప్రయాణికులు ఫెర్రీలు లేదా విమానాల ద్వారా సమీప దేశాల తీరాలకు చేరుకోవచ్చు.

1990లలోనే ఇంజనీర్ నార్మన్ నిక్సన్ ఈ ఆలోచన చేసినప్పటికీ, నిధులు, సాంకేతిక సవాళ్ల కారణంగా ఇప్పటివరకు ఇది కార్యరూపందాల్చలేదు. అయితే, ఈ ప్రాజెక్ట్‌ గనుక పూర్తయితే సముద్రంపై మానవ జీవన విధానంలో ఇదొక నూతన శకానికి నాంది పలకడం ఖాయం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
వైద్య ప్రపంచంలో అద్భుతం.. మ్యాజిక్ మష్రూమ్స్'తో మతిమరుపు మాయం
వైద్య ప్రపంచంలో అద్భుతం.. మ్యాజిక్ మష్రూమ్స్'తో మతిమరుపు మాయం
చాక్లెట్‌ తినాలనిపిస్తోందా? మీ శరీరం ఏం చెబుతుందో తెలుసా!
చాక్లెట్‌ తినాలనిపిస్తోందా? మీ శరీరం ఏం చెబుతుందో తెలుసా!
చికెన్ వండే ముందు ఇలా చేస్తే నీచు వాసన మాటే ఉండదు..
చికెన్ వండే ముందు ఇలా చేస్తే నీచు వాసన మాటే ఉండదు..
వెల్లుల్లి తొక్క తీసి ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే డేంజరే
వెల్లుల్లి తొక్క తీసి ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే డేంజరే
పెళ్లి వేదికపైనే వరుడు వద్దన్న వధువు.. ఎందుకో తెలిస్తే షాక్!
పెళ్లి వేదికపైనే వరుడు వద్దన్న వధువు.. ఎందుకో తెలిస్తే షాక్!
ఇడుపు కాయితం టైటిల్ మార్చను.. బన్నీ వాస్..
ఇడుపు కాయితం టైటిల్ మార్చను.. బన్నీ వాస్..
మరణించిన వారి ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా?
మరణించిన వారి ముక్కు, చెవుల్లో దూది ఎందుకు పెడతారో తెలుసా?
MBBS సీటు రాలేదా? ఈ 5 కోర్సులతో మెడికల్ రంగంలో బంగారు భవిష్యత్!
MBBS సీటు రాలేదా? ఈ 5 కోర్సులతో మెడికల్ రంగంలో బంగారు భవిష్యత్!
వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. జూలైలో 12 రోజులు బ్యాంకులు బంద్‌!
వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. జూలైలో 12 రోజులు బ్యాంకులు బంద్‌!
3 స్పూన్ల నూనెతో కాకరకాయ చేదు పోగొట్టే క్రిస్పీ ఫ్రై చేయండిలా..
3 స్పూన్ల నూనెతో కాకరకాయ చేదు పోగొట్టే క్రిస్పీ ఫ్రై చేయండిలా..
వైద్య ప్రపంచంలో అద్భుతం.. మ్యాజిక్ మష్రూమ్స్'తో మతిమరుపు మాయం
వైద్య ప్రపంచంలో అద్భుతం.. మ్యాజిక్ మష్రూమ్స్'తో మతిమరుపు మాయం
చాక్లెట్‌ తినాలనిపిస్తోందా? మీ శరీరం ఏం చెబుతుందో తెలుసా!
చాక్లెట్‌ తినాలనిపిస్తోందా? మీ శరీరం ఏం చెబుతుందో తెలుసా!
మోదీజీ నా బిడ్డను 'న్యూ ఏజ్ మెగాస్టార్' అని సంబోధించారంటూ..
మోదీజీ నా బిడ్డను 'న్యూ ఏజ్ మెగాస్టార్' అని సంబోధించారంటూ..
దొంగతనం అనుమానంతో.. పని వాళ్లను బంధించిన హీరో!
దొంగతనం అనుమానంతో.. పని వాళ్లను బంధించిన హీరో!
ఇండస్ట్రీ లేడీస్‌కి సేఫ్‌ కాదు.. పెద్దవాళ్లమని చెప్పుకునేవారే..
ఇండస్ట్రీ లేడీస్‌కి సేఫ్‌ కాదు.. పెద్దవాళ్లమని చెప్పుకునేవారే..
అనాథ పిల్లలకు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్!
అనాథ పిల్లలకు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్!
టాలీవుడ్‌పై తమన్నా విసుర్లు ఫైరవుతున్న సౌత్ ఇండస్ట్రీ!
టాలీవుడ్‌పై తమన్నా విసుర్లు ఫైరవుతున్న సౌత్ ఇండస్ట్రీ!
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
తలలు అతుక్కుని పుట్టిన కవలలు.. AI సాయంతో వేరు చేసిన డాక్టర్లు
మరో హనీమూన్‌ తరహా మర్డర్‌ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
మరో హనీమూన్‌ తరహా మర్డర్‌ లోహగడ్ కోట మృతి కేసులో సంచలన విషయాలు!
డేంజర్ జోన్‌లో తెలుగు రాష్ట్రాలు..జూన్‌ 30 వరకు వణికించనున్నవానలు
డేంజర్ జోన్‌లో తెలుగు రాష్ట్రాలు..జూన్‌ 30 వరకు వణికించనున్నవానలు