AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T Shirt: టీ షర్ట్‌‌లో T అంటే ఏంటో తెలుసా..? దీని వెనుకున్న కథ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్నో ట్రెండ్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ దశాబ్దాలుగా ఎవర్ గ్రీన్ ట్రెండ్‌గా దూసుకుపోతున్న ఒకే ఒక్క వస్త్రం.. టీ-షర్ట్. అయితే మనం క్యాజువల్‌గా ధరించే ఈ షర్టు కథ ఒకప్పుడు గనులు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు, సైనికుల దగ్గర మొదలైందనేది ఒక నమ్మలేని నిజం. అసలు డిక్షనరీలోకి ఈ పదం ఎలా ఎంట్రీ ఇచ్చింది? అనేది తెలుసుకుందాం..

T Shirt: టీ షర్ట్‌‌లో T అంటే ఏంటో తెలుసా..? దీని వెనుకున్న కథ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
Why It Is Called T Shirt
Krishna S
|

Updated on: Jun 06, 2026 | 1:23 PM

Share

ఈ రోజుల్లో చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఇష్టపడే దుస్తులు ఏవైనా ఉన్నాయి అంటే అవి ఖచ్చితంగా టీ-షర్టులే. జీన్స్, ట్రాక్ ప్యాంట్స్, షార్ట్స్.. ఇలా దేనిమీదకైనా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయే ఈ వస్త్రం మన లైఫ్‌లో ఒక భాగమైపోయింది. అయితే మన వార్డ్‌రోబ్‌లో రకరకాల రంగుల్లో మెరిసిపోయే ఈ టీ షర్టుల వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అసలు ఈ చొక్కాకు టీ షర్ట్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఇది ఫ్యాషన్ ప్రపంచంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఆ T ఆకారమే దానికి పేరు తెచ్చింది..

టీ షర్టుకు ఆ పేరు రావడానికి అత్యంత ప్రధానమైన కారణం దాని డిజైన్. ఒక టీ షర్టును నేలపై చదునుగా పరిచి చూస్తే.. అది ఇంగ్లీష్ అక్షరం T లాగా కనిపిస్తుంది. మధ్యలో ఉండే మొండెం భాగం, ఇరువైపులా ఉండే చిన్న చేతులు కలిసి పర్ఫెక్ట్ T ఆకారాన్ని ఏర్పరుస్తాయి. అందుకే దీనిని ప్రపంచమంతా టీ-షర్ట్ అని పిలవడం ప్రారంభించింది.

సైనిక లోదుస్తులు

19వ శతాబ్దంలో యూఎస్ సైనికులు తమ ట్రైనింగ్ టైమ్‌లో వీటిని ధరించేవారు. తీవ్రమైన వ్యాయామాలు, కఠినమైన సైనిక శిక్షణ సమయంలో చెమటను పీల్చుకోవడానికి దీనిని ప్రత్యేకంగా వాడేవారు. కాబట్టి దీనిని ట్రైనింగ్ చొక్కా అని పిలిచేవారు. ట్రైనింగ్ అనే పదంలోని మొదటి అక్షరం T కావడం వల్ల కూడా దీనికి ఆ పేరు వచ్చిందని కొంతమంది చరిత్రకారులు బలంగా చెబుతారు.

కార్మికుల ట్యాంక్ టాప్స్ నుండి ఫ్యాషన్ ఐకాన్ వరకు..

మొదట్లో టీ షర్టులను బయటకు వేసుకునే దుస్తులుగా ఎవరూ ఊహించలేదు. కేవలం గనులు, కర్మాగారాలు, రోడ్లు వేసే కార్మికులు ఎండ వేడిమిని, కాకను తట్టుకోవడానికి పై చొక్కాలు తీసేసి లోపల ఉండే ఈ ట్యాంక్ టాప్స్ లేదా టీ షర్టులతోనే పనులు చేసుకునేవారు. కాలక్రమేణా.. శారీరక శ్రమ చేసేవారి దుస్తుల నుండి ఇవి నెమ్మదిగా కాలేజ్ స్టూడెంట్స్, కామన్ మెన్ ఫ్యాషన్ వైపు అడుగులు వేశాయి.

డిక్షనరీలో స్థానం.. హాలీవుడ్ ఇచ్చిన బూస్టింగ్

సాహిత్య పరంగా చూస్తే.. T-Shirt అనే పదాన్ని 1920లో ప్రముఖ రచయిత ఎఫ్. స్కాట్ ఫిట్జ్‌గెరాల్డ్ తన ప్రసిద్ధ నవల దిస్ సైడ్ ఆఫ్ ప్యారడైజ్‌లో మొదటిసారిగా ఉపయోగించారు. ఆ తర్వాతే ఈ పదం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. కొన్నేళ్లకు ప్రఖ్యాత మెరియం -వెబ్‌స్టర్ డిక్షణరీలో కూడా అధికారికంగా ఈ పదాన్ని చేర్చారు.

ఇక 1950ల కాలంలో హాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన మార్లోన్ బ్రాండో, జేమ్స్ డీన్ వంటి నటులు తమ సినిమాల్లో కేవలం వైట్ టీ షర్ట్, జీన్స్ ధరించి స్క్రీన్‌పై కనిపించడంతో యువత అంతా ఆ స్టైల్‌కు ఫిదా అయిపోయారు. అలా లోదుస్తులుగా మొదలైన టీ షర్ట్ ప్రస్థానం.. నేడు బిలియన్ డాలర్ల గ్లోబల్ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారిపోయింది.

Follow Us