AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో అక్రమ ఫార్మా నెట్‌వర్క్ బట్టబయలు.. DCA దాడుల్లో కీలక పత్రాలు, డ్రగ్ సీజ్!

Hyderabad: కూకట్‌పల్లిలో అక్రమంగా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్స్ (APIలు) వ్యాపారం చేస్తున్న సంస్థపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ భారీ దాడి నిర్వహించింది. లైసెన్స్ లేకుండా APIల కొనుగోలు, విక్రయాలు సాగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు యాంటీవైరల్ ఔషధం జిడోవుడిన్‌తో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని DCA హెచ్చరించింది.

హైదరాబాద్‌లో అక్రమ ఫార్మా నెట్‌వర్క్ బట్టబయలు.. DCA దాడుల్లో కీలక పత్రాలు, డ్రగ్ సీజ్!
Major Dca Raid In Kukatpally
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jun 06, 2026 | 1:36 PM

Share

తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) కూకట్‌పల్లిలో అక్రమంగా నిర్వహిస్తున్న యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రిడియెంట్స్(API) వ్యాపారంపై భారీ దాడి నిర్వహించింది. ఎక్సైజ్ శాఖతో కలిసి చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో లైసెన్స్ లేకుండా APIల కొనుగోలు, విక్రయాలు జరుగుతున్న నెట్‌వర్క్‌ను అధికారులు గుర్తించారు. కూకట్‌పల్లి ప్రశాంతి నగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని NCS కాంప్లెక్స్‌లో సైనిక్స్ ల్యాబ్స్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థపై అధికారులు దాడి చేశారు. తనిఖీల్లో డ్రగ్ లైసెన్స్ లేకుండానే APIల వ్యాపారం సాగిస్తున్నట్లు తేలడంతో సంస్థపై కేసు నమోదు చేశారు. దాడి సందర్భంగా సంస్థ యజమాని గాడె రామకృష్ణ రెడ్డి వద్ద నుంచి 170 గ్రాముల జిడోవుడిన్ అనే యాంటీవైరల్ ఔషధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వివిధ APIల కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన బిల్లులు, ఇన్‌వాయిస్‌లు,ఇతర కీలక పత్రాలను కూడా అధికారులు సీజ్ చేశారు.

ఈ ఆపరేషన్‌ను మేడ్చల్ అసిస్టెంట్ డైరెక్టర్ బి. లక్ష్మీ నారాయణ, ప్రశాంతి నగర్ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్. గీతాంజలి ఆధ్వర్యంలో నిర్వహించగా, DCA డిప్యూటీ డైరెక్టర్ జి. శ్రీనివాస్ పర్యవేక్షించారు. స్వాధీనం చేసుకున్న పదార్థాల నమూనాలను ప్రయోగశాలకు పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్రమ APIల సరఫరా వ్యవస్థ వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని DCA తెలిపింది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా APIల విక్రయం, పంపిణీ చేయడం తీవ్రమైన నేరమని అధికారులు స్పష్టం చేశారు. ఇటువంటి నేరాలకు గరిష్ఠంగా ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు. అక్రమ ఔషధ తయారీ, విక్రయాలు లేదా నార్కోటిక్, సైకోట్రోపిక్ పదార్థాలకు సంబంధించిన అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఉంటే తెలంగాణ DCA టోల్‌ఫ్రీ నంబర్ 1800-599-6969కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.

Follow Us
శని త్రయోదశి రేపే.. ఈ ఒక్క రోజు ఇలా పూజిస్తే శని దోషాలు తొలగి..
శని త్రయోదశి రేపే.. ఈ ఒక్క రోజు ఇలా పూజిస్తే శని దోషాలు తొలగి..
బ్యాంకింగ్ AI మోడళ్లకు RBI గైడ్‌లైన్స్‌తో కళ్లెం పడేనా
బ్యాంకింగ్ AI మోడళ్లకు RBI గైడ్‌లైన్స్‌తో కళ్లెం పడేనా
తెలంగాణలో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలంగాణలో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
మెడికల్ AI రీసెర్చ్‌లో పావురాలు ఏం చేస్తున్నాయ్
మెడికల్ AI రీసెర్చ్‌లో పావురాలు ఏం చేస్తున్నాయ్
టాయిలెట్ సీట్లపై కూర్చుని భోజనం.. వింత రెస్టారెంట్ వెనుక వాస్తవం!
టాయిలెట్ సీట్లపై కూర్చుని భోజనం.. వింత రెస్టారెంట్ వెనుక వాస్తవం!
టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. ముగ్గురు తోపు బ్యాటర్లు సింగిల్
టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్.. ముగ్గురు తోపు బ్యాటర్లు సింగిల్
ఏ దేవుడికి ఏ పువ్వు సమర్పించాలి? ఈ పుష్పాలతో పూజిస్తే దైవానుగ్రహం
ఏ దేవుడికి ఏ పువ్వు సమర్పించాలి? ఈ పుష్పాలతో పూజిస్తే దైవానుగ్రహం
వెనిజులాలో భూకంపాన్ని గూగుల్ టెక్నాలజీ ముందే గుర్తించిందా?
వెనిజులాలో భూకంపాన్ని గూగుల్ టెక్నాలజీ ముందే గుర్తించిందా?
ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!
ఏరికోరి తెచ్చుకున్న బౌలర్‌ని ఎగరేసి కొట్టిన ఐర్లాండ్!
డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్
డ్రగ్స్‌పై ఉక్కుపాదం.. డిస్పోజల్ ఫోర్ట్‌నైట్ క్యాంపెయిన్