AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ఏజ్‌ను బట్టి మీరు రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసా..? లెక్క తప్పితే జరిగిదే ఇదే..

మనదేశంలో చాలా మందికి వేడి వేడి టీ కప్పుతోనే ఉదయం మొదలవుతుంది. పని ఒత్తిడి పెరిగినా, కాస్త అలసటగా అనిపించినా వెంటనే గుర్తొచ్చేది టీనే. అయితే మీ వయసుకు రోజుకు ఎన్ని కప్పుల టీ తాగడం సేఫ్ అనేది ఎప్పుడైనా ఆలోచించారా? చాయ్ తాగడం ఎంత కిక్కిస్తుందో.. మోతాదు దాటితే అంతకంటే ఘోరమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మీ ఏజ్‌ను బట్టి మీరు రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలో తెలుసా..? లెక్క తప్పితే జరిగిదే ఇదే..
How Many Cups Of Tea Per Day Is Healthy
Krishna S
|

Updated on: Jun 06, 2026 | 1:40 PM

Share

మన దేశంలో చాలా మందికి టీ లేనిదే ఉదయం అసంపూర్ణంగా అనిపిస్తుంది. కొందరికి నిద్రలేవగానే బెడ్ టీ తాగే అలవాటు ఉంటే.. మరికొందరికి ఆఫీస్ పనిలోనో, ఒత్తిడి వల్లో రోజంతా కప్పుల కొద్దీ టీలు తాగే అలవాటు ఉంటుంది. అయితే అమృతం లాంటి టీని కూడా మోతాదుకు మించి తాగితే అది క్రమంగా శరీరంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ మీ వయసును బట్టి రోజుకు ఎంత టీ తాగడం సరైనదో.. ఎప్పుడు తాగాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

టీ వల్ల లాభ నష్టాలు ఏమిటి?

హెల్త్‌లైన్ ప్రకారం.. టీలో ఉండే కెఫీన్, ఇతర సమ్మేళనాలు శరీరానికి తక్షణ శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తాయి. కానీ వీటిని అతిగా తీసుకున్నప్పుడు అంతే స్థాయిలో హాని కూడా కలిగిస్తాయి. ఇక ఇటీవలి కాలంలో కేటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే గ్రీన్ టీకి ప్రజాదరణ బాగా పెరిగింది. ఈ సమ్మేళనాలు గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో అద్భుతంగా సహాయపడతాయని పలు పరిశోధనల్లో తేలింది. అయితే దీనిని కూడా పరిమితిలోనే తీసుకోవాలి.

ఏ వయసు వారు ఎంత టీ తాగాలి?

రోజుకు ఎంత టీ తాగాలి అనేది వ్యక్తి వయస్సు, ఆరోగ్య స్థితి, వారి జీవనశైలిపై ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

టీనేజర్లు – యువకులు: పెరుగుతున్న వయసు కాబట్టి రోజుకు 1 నుండి 2 కప్పుల కంటే ఎక్కువ కెఫిన్ ఉన్న టీ అస్సలు తాగకూడదు.

ఆరోగ్యంగా ఉన్న పెద్దలు: సాధారణంగా రోజుకు 3 నుండి 5 కప్పుల గ్రీన్ టీ లేదా 2 నుండి 3 కప్పుల నార్మల్ టీ తాగడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

అతిగా తాగితే వచ్చే ముప్పులు ఇవే:

అతిగా టీ తాగడం వల్ల శరీరంలో కెఫీన్ మోతాదు పెరిగిపోయి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

  • విపరీతమైన చంచలత్వం, ఆందోళన పెరగడం.
  • రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోవడం.
  • తరచూ తలనొప్పి రావడం, కడుపులో అసౌకర్యంగా అనిపించడం.

గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్త

గర్భధారణ సమయంలో మహిళలు కెఫిన్ వాడకం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. గర్భధారణ సమయంలో ఎక్కువ మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల లోపల పెరిగే బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదాలు పెరుగుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందువల్ల నిపుణుల సలహా ప్రకారం గర్భిణీలు రోజుకు 300 మిల్లీగ్రాములకు మించి కెఫిన్ తీసుకోకూడదు.

టీ తాగేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.

టీ తాగే పరిమాణంతో పాటు అది తాగే సమయం కూడా చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఖాళీ కడుపుతో తాగడం: ఉదయాన్నే పరగడుపున ఎక్కువగా టీ తాగడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి.

భోజనం చేసిన వెంటనే తాగడం: తిన్న వెంటనే టీ తాగే అలవాటు ఉంటే.. అది ఆహారంలోని ఐరన్‌ను శరీరం శోషించుకోకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల రక్తహీనత వచ్చే ఛాన్స్ ఉంది.

వైద్యుల ప్రకారం.. ఆరోగ్యం కోసం టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ అది తాగే పరిమాణం, సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.

Follow Us
బాయిల్డ్ ఎగ్ vs ఆమ్లెట్: ప్రోటీన్ దేనిలో ఎక్కువ? బరువు తగ్గడానికి
బాయిల్డ్ ఎగ్ vs ఆమ్లెట్: ప్రోటీన్ దేనిలో ఎక్కువ? బరువు తగ్గడానికి
అబ్బబ్బ.. దీని రుచికి ఇంకేదీ సాటిరాదు.. పోషకాల రోటి పచ్చడి..
అబ్బబ్బ.. దీని రుచికి ఇంకేదీ సాటిరాదు.. పోషకాల రోటి పచ్చడి..
ప్రోటీన్ షేక్ కాదు.. రోహిత్ శర్మ లేట్ నైట్ ఫేవరేట్ ఫుడ్ ఇదే
ప్రోటీన్ షేక్ కాదు.. రోహిత్ శర్మ లేట్ నైట్ ఫేవరేట్ ఫుడ్ ఇదే
ఐస్‌క్యూబ్‌లతో అద్భుతం.. ఒక్క ఒక్కసారి రాస్తే చాలు..
ఐస్‌క్యూబ్‌లతో అద్భుతం.. ఒక్క ఒక్కసారి రాస్తే చాలు..
భయం పుట్టించే మిస్టీరియస్ హారర్.. ఓటీటీలోకి వచ్చేసింది..
భయం పుట్టించే మిస్టీరియస్ హారర్.. ఓటీటీలోకి వచ్చేసింది..
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
వారెవ్వా.. బెల్లం గవ్వలు.. ఇలా చేస్తే నోట్లో వేయగానే కరిగిపోతాయి
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
ఫోన్‌పే డబ్బుల కోసం ఎంతకు తెగించావ్‌రా.. స్నేహితుడిని దారుణంగా..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
అద్భుతాలు జరుగుతాయ్.. ఉదయాన్నే బొప్పాయి తింటే శరీరంలో జరిగేదిదే..
ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది
ఆ ఒక్క మాటే రోహిత్ రికార్డ్‌ను బద్దలు కొట్టేలా చేసింది
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!
ప్రహరీ గోడ కడుతున్నారా? ఈ చిన్న పొరపాటు చేస్తే బీటలు వారడం ఖాయం!