స్టార్ హీరోయిన్లకు మించిన అందం.. అయినా ఆఫర్స్ కరువే ఈ ముద్దుగుమ్మకు
Rajitha Chanti
Pic credit - Instagram
06 June 2026
బిగ్‌బాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన పొడుగుకాళ్ల సుందరి దివి వాద్త్యా. ఈ హైదరాబాద్ ముద్దుగుమ్మ వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో దూసుకుపోతోంది.
కేవలం వెండితెరపైనే కాకుండా, సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోషూట్స్‌తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది ఈ అందాల ముద్దుగుమ్మ..
తాజాగా సమ్మర్ సీజన్‌కు సరిపోయేలా ఆమె చేసిన శారీ ఫోటోషూట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దివి లేటెస్ట్ ఫోటోషూట్‌లో వయ్యారాలు ఒలకబోసింది.
ఎంటెక్ పూర్తి చేసి సినిమాలపై ఉన్న మక్కువతో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన దివి.. మహేష్ బాబు 'మహర్షి' చిత్రంలో ఒక చిన్న పాత్రతో కెరీర్ ప్రారంభించింది.
ఆ తర్వాత బిగ్‌బాస్ సీజన్ 4 లో అడుగుపెట్టి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. స్టేజ్ పై చిరంజీవి ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు 'గాడ్ ఫాదర్' సినిమాలో మంచి పాత్ర లభించింది.
ఇటీవల 'లంబసింగి' చిత్రంతో హీరోయిన్‌గా మెప్పించిన ఈ భామ, జీ5 లో వచ్చిన 'మా నీళ్ల ట్యాంక్', 'ఏటీఎం' వంటి వెబ్ సిరీస్‌లలోనూ బోల్డ్ నటనతో ఆకట్టుకుంది.
దివి కేవలం వెండితెరకే పరిమితం కాకుండా ఓటీటీలోనూ దూసుకుపోతుంది. దివికి ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కానీ హీరోయిన్ గా అవకాశాలే రావడం లేదు.
ఇదివరకే నటిగా మంచి మార్కులు కొట్టేసిన దివి.. ప్రస్తుతం సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది ఈ అమ్మడు.