ఆ హీరో అంటే సాయి పల్లవికి పిచ్చి ఇష్టమట.. మనసులో మాట చెప్పేసింది..

Rajitha Chanti

Pic credit - Instagram

06 June 2026

 'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను తన నటనతో మంత్రముగ్ధులను చేసిన సాయి పల్లవి, కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, సహజ నటనతో లేడీ పవర్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది.

ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్న నేటి కాలంలో, సాయి పల్లవికి అత్యంత ఇష్టమైన హీరో ఎవరో తెలిస్తే అభిమానులు ఆశ్చర్యపోక తప్పదు. ఆమె మరెవరో కాదు, మెగాస్టార్ చిరంజీవి.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన అభిమాన హీరో గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి పేరును ప్రస్తావించారు. చిరంజీవి అంటే తనకు ఇష్టమని చెప్పుకొచ్చింది.

చిరంజీవి అద్భుతమైన నటన, ఆయన డైలాగ్ డెలివరీ, మరియు డాన్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె మనసులో మాటను బయటపెట్టారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరలవుతున్నాయి.

చిరంజీవిని తన ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోగా పేర్కొనడం పట్ల అభిమానులు ఆశ్చర్యంతో పాటు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి హిందీలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చి తన నటనతో తెలుగు ,తమిళ భాషల్లో వరుస విజయాలు అందుకుంటున్న సాయి పల్లవి, ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

 ప్రస్తుతం బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'రామాయణం'లో సీతమ్మ పాత్రలో కనిపించబోతున్న ఈ నేచురల్ బ్యూటీ, అక్కడ కూడా తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు.

తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న సాయి పల్లవి, తన వ్యక్తిత్వంతో , నటనతో సినీ పరిశ్రమలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ బ్యూటీకి క్రేజ్ ఎక్కువే ఉంటుంది.