AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుగాలి ప్రీతికి న్యాయం చేయలేనప్పుడు..కర్నూలులో జ్యూడిషియల్ క్యాపిటల్ ఎందుకు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్…కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్నారు.  జిల్లాలో 3 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన 10వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి మృతి విషయంలో నిందితులను కఠినంగా శిక్షించి..బాలిక కుటుంబానికి  న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ..ఆయన జనశ్రేణులతో కలిసి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో తీవ్ర ఆవేదనతో మాట్లాడారు పవన్. ఆడబిడ్డను స్కూల్‌కి పంపించి..తిరిగి వస్తుందని ఎదురుచూస్తోన్న తల్లికి..తన కుమార్తె విగతజీవిగా వస్తే ఎంత బాధగా ఉంటుందో చెప్పలేనిదన్నారు. […]

సుగాలి ప్రీతికి న్యాయం చేయలేనప్పుడు..కర్నూలులో జ్యూడిషియల్ క్యాపిటల్ ఎందుకు..
Ram Naramaneni
|

Updated on: Feb 12, 2020 | 5:35 PM

Share

జనసేన అధినేత పవన్ కళ్యాణ్…కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్నారు.  జిల్లాలో 3 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన 10వ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి మృతి విషయంలో నిందితులను కఠినంగా శిక్షించి..బాలిక కుటుంబానికి  న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ..ఆయన జనశ్రేణులతో కలిసి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో తీవ్ర ఆవేదనతో మాట్లాడారు పవన్. ఆడబిడ్డను స్కూల్‌కి పంపించి..తిరిగి వస్తుందని ఎదురుచూస్తోన్న తల్లికి..తన కుమార్తె విగతజీవిగా వస్తే ఎంత బాధగా ఉంటుందో చెప్పలేనిదన్నారు. సుగాలి ప్రీతి మరణం గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పినప్పడు..తన కన్నీళ్లు వచ్చాయని పేర్కొన్నారు. మాట చెప్పడం కాకుండా..రాత పూర్వకంగా ప్రీతి కేసును సిబిఐకి అప్పగిస్తామని ప్రభుత్వం చెప్పకపోతే..తానే హెచ్చార్సీ దృష్టికి విషయాన్ని తీసుకెళ్తానని తెలిపారు. అవసరమైతే నిరాహారదీక్షకు సైతం సిద్దమన్నారు పవన్.

కర్నూలులో జ్యూడిషియల్ క్యాపిటల్ అంటున్నారు..మరి ఇదే ప్రాంతానికి చెందిన బాలిక మృతికి న్యాయం చేయలేనప్పడు..దానివల్ల ఉపయోగం ఏంటని పవన్ ప్రశ్నించారు. దిశ గురించి సీఎం జగన్ మాట్లాడినప్పుడు..సుగాలి ప్రీతి గురించి ఎందుకు మాట్లాడరని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరోజు, రెండు రోజుల కోసం పార్టీ పెట్టలేదన్న పవన్…భావితరాల మెరుగైన భవిష్యత్తే తన లక్ష్యమన్నారు. జనసేన ఉన్నది ప్రజలు కష్టాలు తీర్చడం కోసం, వారి అండగా నిలవడం కోసమే అని తెలిపారు.