Breaking: సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్

సచివాలయం కూల్చివేతపై తొందరెందుకని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైదరాబాద్ హైకోర్టు. తాము ఆదేశాలిచ్చే వరకు సచివాలయ భవనాలు కూల్చవద్దని ఆదేశాలు జారీ చేసింది. నూతన సచివాలయంపై కేబినెట్ పూర్తి ఫైనల్ నమూనా నివేదిక తీసుకుని కోర్టుకు రావాలని అడ్వకేట్ జనరల్‌కు నిర్దేశించింది. కొత్త సచివాలయానికి ఎలాంటి డిజైన్లు సిద్ధం కానప్పుడు పాత సచివాలయ భవనాలను కూల్చి ఏం లాభమని హైకోర్టు ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. సచివాలయం కూల్చవేతపై దాఖలైన పిటీషన్లను కోర్టు బుధవారం విచారించింది. గతంలో ఈ […]

Breaking: సచివాలయం కూల్చివేతకు హైకోర్టు బ్రేక్
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 12, 2020 | 5:22 PM

సచివాలయం కూల్చివేతపై తొందరెందుకని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైదరాబాద్ హైకోర్టు. తాము ఆదేశాలిచ్చే వరకు సచివాలయ భవనాలు కూల్చవద్దని ఆదేశాలు జారీ చేసింది. నూతన సచివాలయంపై కేబినెట్ పూర్తి ఫైనల్ నమూనా నివేదిక తీసుకుని కోర్టుకు రావాలని అడ్వకేట్ జనరల్‌కు నిర్దేశించింది.

కొత్త సచివాలయానికి ఎలాంటి డిజైన్లు సిద్ధం కానప్పుడు పాత సచివాలయ భవనాలను కూల్చి ఏం లాభమని హైకోర్టు ధర్మాసనం ఏజీని ప్రశ్నించింది. సచివాలయం కూల్చవేతపై దాఖలైన పిటీషన్లను కోర్టు బుధవారం విచారించింది. గతంలో ఈ పిటీషన్లను విచారించిన సందర్భంలోను కూల్చివేతలపై ప్రభుత్వాన్ని సమగ్ర నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే, నివేదిక ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం చేయలేదని కోర్టుకి ప్రభుత్వం తెలిపింది. దాంతో.. డిజైన్, ప్లాన్ ఇంకా పూర్తి కానపుడు పాత భవనాలను కూల్చేందుకు ప్రభుత్వం ఎందుకు తొందరపడుతుందని ధర్మాసనం నిలదీసింది.

అవసరమైన టెక్నాలజీ ఉన్నప్పటికీ డిజైన్లు, ప్లాన్లు ఇంకా రెడీ కాలేదని చెప్పడం ఏంటని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కూల్చివేతకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుందంటున్నప్పుడు డిజైన్ ప్లాన్ల కోసం కేబినెట్ ఎందుకు నిర్ణయాలు తీసుకోవడం లేదంటూ లాజికల్‌ పాయింట్ లాగింది హైకోర్టు ధర్మాసనం. కేబినెట్ ఫైనల్ నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. కేబినెట్ అప్రూవ్ చేయబోయే డిజైన్లు, ప్లాన్లను కోర్టుకు అందజేయాలని నిర్దేశించింది.