కేసీఆర్‌కు షాకిచ్చిన తెలంగాణా హైకోర్టు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు షాకిచ్చింది హైదరాబాద్ హైకోర్టు. పెండింగ్‌లో వున్న రైతుబంధు నిధులను తక్షణం విడుదల చేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతు బంధు రెండవ విడత, మూడవ విడత నిధులు విడుదల కాలేదని గతంలో హైకోర్టులో రిటైర్డ్ డీఎస్పీ రాఘవ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తలపెట్టిన రైతు బంధు రైతు బంధు పథకం రెండవ విడత,మూడవ విడత డబ్బులు రాలేదని కోర్టును కోరిన యాదాద్రి జిల్లా […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు షాకిచ్చింది హైదరాబాద్ హైకోర్టు. పెండింగ్‌లో వున్న రైతుబంధు నిధులను తక్షణం విడుదల చేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతు బంధు రెండవ విడత, మూడవ విడత నిధులు విడుదల కాలేదని గతంలో హైకోర్టులో రిటైర్డ్ డీఎస్పీ రాఘవ రెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
ప్రభుత్వం తలపెట్టిన రైతు బంధు రైతు బంధు పథకం రెండవ విడత,మూడవ విడత డబ్బులు రాలేదని కోర్టును కోరిన యాదాద్రి జిల్లా రామన్న పేట్ మండలం బోగరం గ్రామానికి చెందిన మాజీ డిఎస్పీ రాఘవరెడ్డి కోర్టు కెక్కారు. తనకు రావాల్సిన రైతు బంధు పథకం నిధులను విడుదల చేయాలని పిటీషనర్ కోరారు. రాఘవరెడ్డి పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనతోపాటు పెండింగ్ లో వున్న రైతు బంధు నిధులు విడుదల చేయడం ద్వారా రైతులకు న్యాయం చేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదేశాలు జారీ చేసింది.
అయిదేళ్ళ క్రితం ప్రారంభించిన రైతు బంధు పథకంలో ఇప్పటికీ రెండో, మూడో విడత నిధులు రాకపోవడంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రైతాంగం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో రాఘవరెడ్డి కేసు రెఫరెన్స్‌గా తీసుకుని పెండింగ్ నిధులను విడుదల చేయాలని హైదరాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.