భారీ డిమాండ్‌తో క్రేజీ ప్రాజెక్ట్‌ మిస్ చేసుకుందా..!

సెకండ్ ఇన్నింగ్స్‌లో బాహుబలి ఇచ్చిన ఊపుతో సీనియర్ నటి రమ్యకృష్ణ దూసుకుపోతున్నారు. అయితే సెలక్టివ్‌గా కథలను ఎంచుకున్న ఆమె ఇటీవల ఓ భారీ ప్రాజెక్ట్‌ను మిస్ చేసుకుందట. అందులో తన పాత్ర బాగా నచ్చినప్పటికీ.. రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గనని ఆమె చెప్పిందట. దీంతో ఆ పాత్ర కోసం బాలీవుడ్‌ హీరోయిన్‌ను తీసుకున్నారట నిర్మాతలు. అసలు విషయమేంటంటే.. 2018లో విజయం సాధించిన కన్నడ చిత్రం కేజీఎఫ్ సీక్వెల్ ఇప్పుడు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా […]

భారీ డిమాండ్‌తో క్రేజీ ప్రాజెక్ట్‌ మిస్ చేసుకుందా..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 12, 2020 | 5:50 PM

సెకండ్ ఇన్నింగ్స్‌లో బాహుబలి ఇచ్చిన ఊపుతో సీనియర్ నటి రమ్యకృష్ణ దూసుకుపోతున్నారు. అయితే సెలక్టివ్‌గా కథలను ఎంచుకున్న ఆమె ఇటీవల ఓ భారీ ప్రాజెక్ట్‌ను మిస్ చేసుకుందట. అందులో తన పాత్ర బాగా నచ్చినప్పటికీ.. రెమ్యునరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గనని ఆమె చెప్పిందట. దీంతో ఆ పాత్ర కోసం బాలీవుడ్‌ హీరోయిన్‌ను తీసుకున్నారట నిర్మాతలు.

అసలు విషయమేంటంటే.. 2018లో విజయం సాధించిన కన్నడ చిత్రం కేజీఎఫ్ సీక్వెల్ ఇప్పుడు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇక ఇందులో ఓ కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించారట దర్శకనిర్మాతలు. కథ విన్న తరువాత ఇందులో నటించేందుకు ఒప్పుకున్న శివగామి.. భారీ రెమ్యునరేషన్ అడిగిందట. దీంతో వెనక్కి తగ్గిన నిర్మాతలు.. ఆ పాత్ర కోసం బాలీవుడ్ భామ రవీనా టాండెన్‌ను సంప్రదించారట. ఇక ఈ ఆఫర్‌కు ఆమె ఒప్పుకోవడం, డేట్లు ఇచ్చేయడం, ఇటీవలే షూటింగ్‌లో పాల్గొనడం వరుసగా జరిగిపోయాయి. మరి ఈ పాత్ర రవీనా టాండెన్‌కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా కేజీఎఫ్‌ 2లో యశ్ హీరోగా నటిస్తుండగా.. నిధి శెట్టి, సంజయ్ దత్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం ఈ జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రమ్యకృష్ణ.. ‘రంగ మార్తండ’ చిత్రంతో పాటు ‘రొమాంటిక్‌’ మూవీలో నటిస్తోంది.