నేను ‘ఆర్‌ఆర్ఆర్’లో నటించట్లేదు..అలా చేస్తే 7’O’ క్లాక్ బ్లేడ్..
రాహుల్ రామకృష్ణ..తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న నటుడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఈ మల్టీ టాలెంటడ్ యాక్టర్ ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోష్‌లో ఉన్నాడు. అయితే దర్శకదిగ్గజం ‘రాజమౌళి’ తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రాహుల్ ఓ కీలక రోల్‌కి సెలక్టయ్యాడని రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు ఈ నటుడు. తాను “ఆర్ఆర్ఆర్’ నటించడం లేదని అదంతా ఫాల్స్ న్యూస్ అని కొట్టిపారేశాడు […]
రాహుల్ రామకృష్ణ..తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న నటుడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విపరీతమైన క్రేజ్ సంపాదించిన ఈ మల్టీ టాలెంటడ్ యాక్టర్ ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోష్‌లో ఉన్నాడు. అయితే దర్శకదిగ్గజం ‘రాజమౌళి’ తెరకెక్కిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో రాహుల్ ఓ కీలక రోల్‌కి సెలక్టయ్యాడని రూమర్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు ఈ నటుడు. తాను “ఆర్ఆర్ఆర్’ నటించడం లేదని అదంతా ఫాల్స్ న్యూస్ అని కొట్టిపారేశాడు రాహుల్. ఆ సినిమాలో ఏం జరుగుతుందో తెలియదని, అందరూ ఆ మూవీ గురించి అడిగి ఇరికిస్తున్నారని పేర్కొన్నాడు.
రాహుల్ రామకృష్ణ సమాధానాన్ని స్కిప్ చేయడానికి ప్రయత్నించగా..మూవీలో రోల్ గురించి అడగనని, జస్ట్ రాజమౌళి గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందని యాంకర్ ప్రశ్నించింది. అయితే ఆమె అడిగిన ప్రశ్నకు తన వద్ద ఎటువంటి సమాధానం లేదని, అసలు ఎలా అన్సర్ చెయ్యాలో కూడా తెలియదంటూ చెప్పుకొచ్చాడు రాహుల్. ఒకవేళ సినిమాలో కనిపిస్తే తనకు సారీ చెప్పాలని యాంకర్ అడగ్గా..తనకు ఇది 7 ‘O’ క్లాక్ బ్లేడ్ మూమెంట్ అని సరదాగా టాపిక్ ముగించాడు ఈ ఏస్ నటుడు.