నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్..!
ఎన్టీఆర్…తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తిరుగులేని, తరిగిపోని ఇమేజ్ ఉన్న నేమ్ ఇది. పారాణికం, జానపదం, ఫాంటసీ..ఏ జానర్ సినిమా చేసినా, అందులో ఏ పాత్ర వేసినా..అచ్చుగుద్దినట్టు దిగిపోయేవాడు ఎన్టీవోడు. కేవలం సినిమాలే కాదు..రాజకీయాల్లో కూడా ఆయనో సెన్సేషన్. ఆయన తర్వాత నెక్ట్ జనరేషన్ హీరోలుగా తెరపైకి వచ్చిన బాలకృష్ణ, హరికృష్ణ ఆయన పేరుని నిలబెట్టారు. ముఖ్యంగా బాలకృష్ణ విభిన్న ప్రయత్నాలతో తండ్రికి తగ్గ తనయుడిగా ఇప్పటికి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక మూడవ జరరేషన్‌లో జూనియర్ ఎన్టీఆర్, […]
ఎన్టీఆర్…తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తిరుగులేని, తరిగిపోని ఇమేజ్ ఉన్న నేమ్ ఇది. పారాణికం, జానపదం, ఫాంటసీ..ఏ జానర్ సినిమా చేసినా, అందులో ఏ పాత్ర వేసినా..అచ్చుగుద్దినట్టు దిగిపోయేవాడు ఎన్టీవోడు. కేవలం సినిమాలే కాదు..రాజకీయాల్లో కూడా ఆయనో సెన్సేషన్. ఆయన తర్వాత నెక్ట్ జనరేషన్ హీరోలుగా తెరపైకి వచ్చిన బాలకృష్ణ, హరికృష్ణ ఆయన పేరుని నిలబెట్టారు. ముఖ్యంగా బాలకృష్ణ విభిన్న ప్రయత్నాలతో తండ్రికి తగ్గ తనయుడిగా ఇప్పటికి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక మూడవ జరరేషన్‌లో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న సినిమా ఫీల్డ్‌కి వచ్చినా..ఒక్క జూనియర్ మాత్రమే ఇండస్ట్రీ టాప్ హీరోగా దుమ్ములేపుతున్నారు. అందరివి కలుపుకున్నా ఏడాదికి రెండు, మూడు సినిమాలు రావడమే గగనమైంది.
అందుకే ఇప్పుడు నందమూరి అభిమానుల చూపంతా బాలయ్య తనయుడు నందమూరి మోక్షజ్ఞపై పడింది. ఈ కుర్రాడు ఎప్పుడు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తాడా అని చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే పలుసార్లు మోక్షు ఎంట్రీ కన్ఫామ్ అయిందని టాక్ వచ్చినా..అవన్ని రూమర్స్‌గానే మిగిలిపోయాయి. కానీ ఈ నందమూరి వారసుడు సినిమాలపై పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదనే వార్త చాలామందిని షాక్‌కి గురిచేసింది. అయితే బాలయ్య మాత్రం మోక్షు ఎంట్రీపై అభిమానులకు అదిరిపోయే హోప్ ఇచ్చారు. త్వరలోనే తనయుడ్ని అమెరికా పంపాలని..నటసింహం నిర్ణయం తీసుకున్నారట. న్యూయార్క్‌లోని లీ స్టార్స్ బర్గ్ ఫిలిం ఇన్ స్టిట్యూట్‌లో ఒక షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ చేసేందుకు మోక్షూ ఒప్పుకున్నాడట. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.