AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget bikes: మీ జీతాన్ని బట్టి.. మీరు ఏ బైక్ కొనాలో.. ఈ సింపుల్‌ ఫార్ములాతో ఈజీగా తెలుసుకోండి!

ప్రతి ఒక్క యువకుడికి ఒక డ్రీమ్ బైక్ ఉంటుంది. జాబ్ చేసేప్పుడు ఎలాగైనా ఆ డ్రీమ్‌ను ఫుల్‌ఫిల్ చేసుకుందాం అనుకుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది సరైన అవగాహన లేక తమ బడ్జెట్‌కు మించిన ధర పెట్టి బైక్‌ను కొనేస్తుంటారు. కానీ తర్వాత EMIలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి మీరు బైక్‌ కొనేప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే ఫ్యూచర్‌లో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉంటారు. అవేంటో చూద్దాం.

Budget bikes: మీ జీతాన్ని బట్టి.. మీరు ఏ బైక్ కొనాలో.. ఈ సింపుల్‌ ఫార్ములాతో ఈజీగా తెలుసుకోండి!
How To Buy Your Dream Bike Without Debt Trap
Anand T
|

Updated on: Jun 24, 2026 | 1:20 PM

Share

మీరు మీకు వచ్చే జీతంతోనే మీ డ్రీమ్ బైక్‌ను కొని ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే.. 10-3-15 అనే నియమాన్ని అర్థం చేసుకోవాలి. ఏమిటి? దీన్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఈ నియమం ప్రకారం.. మీరు బైక్ కొనాలి అనుకుంటే.. ఆ బైక్ ధరలో 10 శాతం డబ్బును డౌన్‌ పేమెంట్‌గా చెల్లించండి. మిగతా మొత్తాన్ని మూడేళ్లకు ఈఎమ్‌ఐ కింద కన్వర్ట్ చేసుకోండి. పొరపాటున కూడా ఈ గడువు మూడేళ్లు దాటకుండా చూసుకోండి. అలాగే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ముఖ్యమైన విషయం ఏమింటంటే.. మీ మీ బైక్‌ కోసం కట్టే ఈఎమ్‌ఐ అనేది మీకు వచ్చే జీతంలో 15 శాతానికి మించకుండా ఉండేలా చూసుకోండి. ఈ నియమాన్ని పాటించడం ద్వారా మీరు బైక్ కొన్న కూడా తర్వాత పెద్దగా ఇబ్బందులు ఉండవు అని నిపుణులు చెబుతున్నారు.

మీ జీతం ఆధారంగా బైక్ బడ్జెట్ ఎంతో డిసైజ్ చేసుకోండి

నెలవారీ జీతం రూ.20,000 ఉన్నవారి బైక్ బడ్జెట్ ఎంత?

ఒక వేల మీకు నెలకు రూ. 20,000 జీతం చేతికి వస్తుంటే.. ఈ నియమం ప్రకారం మీ నెలవారీ ఈఎంఐ రూ.3,000 మించకూడదు. అలాగే మీరు కొనే బైక్ ధర రూ.1లక్షకు మించకూడదు. అంటే మీ బైక్ బడ్జెట్ వచ్చేసి రూ.లక్ష

నెలవారీ జీతం రూ.30,000 ఉన్నవారి బైక్ బడ్జెట్

ఒక వేల మీకు నెలకు రూ. 30,000 జీతం చేతికి వస్తుంటే.. ఈ నియమం ప్రకారం మీ నెలవారీ ఈఎంఐ రూ.4,500 మించకూడదు. అలాగే మీకు వచ్చే ఈ జీతంతో మీరు రూ.1,62,000 వరకు ధర ఉన్న బైక్‌ను కొనుగోలు చేయవచ్చు.

నెలవారీ జీతం రూ.50,000 ఉన్నవారి బైక్ బడ్జెట్

ఒక వేల మీకు నెలకు రూ. 50,000 జీతం చేతికి వస్తుంటే.. ఈ నియమం ప్రకారం మీ నెలవారీ ఈఎంఐ రూ.7,500 మించకూడదు. అలాగే మీకు వచ్చే ఈ జీతంతో మీరు రూ.2,70,000 వరకు ధర ఉన్న బైక్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఈ విధంగా, మీ నెలవారీ జీతానికి సరిపోయే సరైన బడ్జెట్‌ను నిర్ణయించుకోవడం ద్వారా మీ కలల వాహనాన్ని తెలివిగా కొనుగోలు చేయవచ్చు. ఈ నియమాన్ని కేవలం బైక్ కొనడానికే కాకుండా, ఇతర వస్తువుల కొనుగోళ్లకు కూడా వర్తింపజేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీ జీతాన్ని బట్టి.. మీరు ఏ బైక్ కొనాలో.. ఇలా ఈజీగా తెలుసుకోండి
మీ జీతాన్ని బట్టి.. మీరు ఏ బైక్ కొనాలో.. ఇలా ఈజీగా తెలుసుకోండి
తనను జైలుకు పంపమని చాలా రిక్వెస్ట్ చేశాడు.. అలా జరక్కపోవడంతో
తనను జైలుకు పంపమని చాలా రిక్వెస్ట్ చేశాడు.. అలా జరక్కపోవడంతో
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. రోహిత్ శర్మ రికార్డుపై కన్నేసిన సంజూ
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. రోహిత్ శర్మ రికార్డుపై కన్నేసిన సంజూ
ఏ వంటకు ఏ నూనె వాడాలి? ఆరోగ్యానికి ఏ వంట నూనె బెస్ట్?
ఏ వంటకు ఏ నూనె వాడాలి? ఆరోగ్యానికి ఏ వంట నూనె బెస్ట్?
ఆఫీస్‌కు దూరం.. మనుషులకు కూడా దూరమేనా? వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పేచీ..
ఆఫీస్‌కు దూరం.. మనుషులకు కూడా దూరమేనా? వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పేచీ..
చరమాంకాన్ని మాతృభూమిలోనే గడపాలనే సంకల్పంతో..
చరమాంకాన్ని మాతృభూమిలోనే గడపాలనే సంకల్పంతో..
AI యుగంలో టీచర్లకు BEd ఒక్కటే సరిపోతుందా? ప్రమాదంలో ఉపాధ్యాయులు
AI యుగంలో టీచర్లకు BEd ఒక్కటే సరిపోతుందా? ప్రమాదంలో ఉపాధ్యాయులు
భారత్‌‌లోని నగర జనాలను భయపెడుతున్న తీవ్ర హెచ్చరిక
భారత్‌‌లోని నగర జనాలను భయపెడుతున్న తీవ్ర హెచ్చరిక
నోటికి అమృతంలా అనిపించే ఆంధ్ర టొమాటో చారు!
నోటికి అమృతంలా అనిపించే ఆంధ్ర టొమాటో చారు!
మెట్రో స్టేషన్‌లోని అనుకోని అతిథి.. ఇది ఎంత ప్రమాదకరమో తెలిస్తే..
మెట్రో స్టేషన్‌లోని అనుకోని అతిథి.. ఇది ఎంత ప్రమాదకరమో తెలిస్తే..