హాంకాంగ్ లో… .. రణరంగంగా మారిన షాపింగ్ మాల్..
హాంకాంగ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు ఆదివారం ఓ షాపింగ్ మాల్ లో చొరబడ్డారు. పోలీసులతో ఘర్షణలకు దిగారు. ఓ వ్యక్తి కత్తి పట్టుకుని గుంపులపై విచక్షణారహితంగా దాడి చేస్తూ .. ఏండ్రు చ్యు అనే స్థానిక రాజకీయ నేత చెవి కొరికి పారిపోయాడు. అయితే కొద్దిసేపట్లోనే అతడ్ని పట్టుకుని కొందరు చితక్కొట్టారు. ఏండ్రు చ్యు రక్తమోడుతున్న తన చేతులతో సగం చెవి ముక్కను ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టుకున్న దృశ్యాన్ని అక్కడి టీవీ ప్రసారం చేసింది. […]
హాంకాంగ్ లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులు ఆదివారం ఓ షాపింగ్ మాల్ లో చొరబడ్డారు. పోలీసులతో ఘర్షణలకు దిగారు. ఓ వ్యక్తి కత్తి పట్టుకుని గుంపులపై విచక్షణారహితంగా దాడి చేస్తూ .. ఏండ్రు చ్యు అనే స్థానిక రాజకీయ నేత చెవి కొరికి పారిపోయాడు. అయితే కొద్దిసేపట్లోనే అతడ్ని పట్టుకుని కొందరు చితక్కొట్టారు. ఏండ్రు చ్యు రక్తమోడుతున్న తన చేతులతో సగం చెవి ముక్కను ఓ ప్లాస్టిక్ కవర్లో పెట్టుకున్న దృశ్యాన్ని అక్కడి టీవీ ప్రసారం చేసింది. హాంకాంగ్ పై చైనా ఆధిపత్యాన్ని సహించని నిరసనకారుల్లో కొందరు అంతటి బీభత్స పరిస్థితుల్లోనూ స్లోగన్స్ ని నిరసన పాటలుగా కూర్చి పాడడం విశేషం. అటు పోలీసులతో జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు.టైకూ సింగ్ అనే చోట ఓ హోటల్ బయట ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువు ప్రయోగించారు. సంఘటనను చిత్రీకరించేందుకు వస్తున్న కెమెరామెన్లు, జర్నలిస్టులపై పెప్పర్ స్ప్రే చల్లారు. చైనాకు చెందిన వ్యాపార సముదాయాలపై ప్రొటెస్టర్స్ దాడులు చేయడంతో.. పోలీసులు రెచ్చిపోయారు. అటు- ఈ నగరంలో ఆందోళనకారుల నిరసన 22 వ వారానికి చేరింది.