అమరావతిలోను లాంగ్ మార్చ్? పవన్ యాక్షన్ ప్లాన్ షురూ !
అదిరిపోయే జనంతో విశాఖలో లాంగ్ మార్చ్‌తో అదర గొట్టిన జనసేన అదినేత పవన్ కల్యాణ్.. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ షురూ అయ్యిందా ? పరిస్థితి.. అవకాశాలను పరిశీలిస్తే నిజమేననిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. బ్రహ్మాండమైన ప్రజా ప్రదర్శన తర్వాత పదునైన మాటలతో సాగిన పవన్ కల్యాణ్ ప్రసంగం ఆద్యంతం వైఎస్ జగన్ ప్రభుత్వం విమర్శలు, ఆరోపణలతో కొనసాగింది. తనపై వ్యక్తిగతంగాను, రాజకీయంగాను విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలను పేరుపేరునా గుర్తు చేస్తూ.. తన వెర్షన్ చెప్పడంతోపాటు వారిని ఇరకాటంలో పెట్టేలా […]

అదిరిపోయే జనంతో విశాఖలో లాంగ్ మార్చ్‌తో అదర గొట్టిన జనసేన అదినేత పవన్ కల్యాణ్.. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ షురూ అయ్యిందా ? పరిస్థితి.. అవకాశాలను పరిశీలిస్తే నిజమేననిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. బ్రహ్మాండమైన ప్రజా ప్రదర్శన తర్వాత పదునైన మాటలతో సాగిన పవన్ కల్యాణ్ ప్రసంగం ఆద్యంతం వైఎస్ జగన్ ప్రభుత్వం విమర్శలు, ఆరోపణలతో కొనసాగింది. తనపై వ్యక్తిగతంగాను, రాజకీయంగాను విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలను పేరుపేరునా గుర్తు చేస్తూ.. తన వెర్షన్ చెప్పడంతోపాటు వారిని ఇరకాటంలో పెట్టేలా ప్రసంగించిన పవన్ కల్యాణ్ స్పీచ్‌కు భారీ స్పందనే వచ్చింది. దాంతో ఉలిక్కి పడిన వైసీపీ నేతలు ఒక్కరొక్కరే జనసేనాని మీద విరుచుకు పడుతున్నారు.
ఇదంతా పక్కన పెడితే.. పవన్ కల్యాణ్ ప్రసంగంలో అత్యంత కీలకాంశం. ఏపీలో నెలకొన్న ఇసుక అవస్థలను రెండు వారాల్లో పూర్తిగా అరికట్టాలన్న అల్టిమేటం. అయిదు నెలలుగా పేరుకుపోయిన సమస్యను రెండువారాల్లో పూర్తిగా పరిష్కరించడం సాధ్యమా అని వైసీపీ నేతలను ప్రశ్నిస్తే కనీసం 20 రోజులైనా పడుతుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. టీవీ9 చర్చలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.

మరి పవన్ కల్యాణ్ అల్టిమేటం మేరకు రెండు వారాల్లో ఇసుక సమస్యను పరిష్కరించకపోతే ఏంటీ అంటే.. అది ఆయనే చెప్పారు. విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ తరహాలోనే అమరావతిలో జనసేన లాంగ్ మార్చ్ నిర్వహణకు సిద్దమవుతుందని పవన్ కల్యాణ్ ఆదివారం నాడు విశాఖ లాంగ్ మార్చ్ నుద్దేశించిన చేసిన ప్రసంగంలోనే తేల్చి చెప్పారు. అధికార పార్టీ 20 రోజులైనా సమయం పడుతుందని చెబుతుంటే.. జనసేనాని విధించిన గడువు కేవలం రెండు వారాలు. సో.. జనసేన అమరావతి లాంగ్ మార్చ్‌కు సిద్దం కావాల్సిన పరిస్థితి.

లాంగ్ మార్చ్ తర్వాత విశాఖలోనే మకాం వేసిన జనసేన అధినేత సోమవారం గాజువాక నియోజకవర్గం ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్ర స్థాయిలో వున్న నేతలతోను మంతనాలు జరిపారు. ప్రభుత్వం చెబుతున్నట్లు 20 రోజులు వేచి చూడడమా లేక తాను ముందే చెప్పినట్లు 2 వారాలు వేచి చూసి.. తదుపరి చర్య అంటే అమరావతిలో లాంగ్ మార్చ్ నిర్వహించడమా అన్న అంశమే జనసేన స్టేట్ లెవల్ లీడర్ల భేటీలో పవన్ కల్యాణ్ ప్రస్తావిస్తున్న అంశమని తెలుస్తోంది.
సో.. మొత్తానికి పవన్ విధించిన డెడ్‌లైన్ కంటే ప్రభుత్వం చెబుతున్న సమయం ఎక్కువ కాబట్టి.. తాను మెత్తబడలేదు అనిపించుకోవాలంటే అమరావతి లాంగ్ మార్చ్‌కు ప్రణాళిక సిద్దం చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు జనసేనకు, ఆ పార్టీ చీఫ్‌కు వుందన్నది విశ్లేషకుల మాట.




