AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హీట్‌వేవ్స్ ఎఫెక్ట్.. గర్భిణీలు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

ప్రస్తుతం ఎండలు దంచి కొడుతున్నాయి. రోహిణి కార్తె కూడా ప్రారంభం కాబోతుంది. దీంతో ఈ సమయంలో చాలా మంది అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ సమయంలో గర్భిణీలు తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే హీట్ వేవ్స్ వలన తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యంపై చాలా ప్రభావం పడే ఛాన్స్ ఉన్నదంట. కాగా, ఈ సమయంలో గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

Samatha J
|

Updated on: May 21, 2026 | 9:48 AM

Share
చాలా వరకు గర్భిణీల శరీరంలో ఎక్కువ వేడి ఉంటుంది. ఎక్కువ రక్తప్రసరణ జరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. సహజంగానే బాడీ కూలింగ్ సిస్టమ్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ సమ్మర్‌లో అధిక వేడి వీరి పై చాలా ప్రభావం చూపనుంది. దీని వలన కొన్ని సార్లు హీట్ స్ట్రోక్ బారిన పడే ప్రమాదం కూడా లేకపోలేదు. అందువలన తప్పకుండా ఆరోగ్యం విషయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. వీలైనంత వరకు స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండటం మంచిది.

1 / 5
ఉదయాన్నే టీ, కాఫీలకు బదులు కొబ్బరి నీళ్లు, ఎక్కువ నీరు తాగడం, ఫ్రూట్ జ్యూస్‌లు తీసుకోవడం చేయాలి. ముఖ్యంగా ఎక్కువగా సలాడ్ తీసుకోవడం అవసరం, తప్పకుండా మీ డైట్‌లో దోసకాయ, పుచ్చకాయ, నారింజ వంటివి ఉండాలి. ఇవి మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా, బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

2 / 5
వీలైనంత వరకు మధ్యాహ్నం 12 అయ్యింది అంటే ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది. అలాగే ఎప్పుడు కూడా ఎండలో ఎక్కువ సేపు ఉండకూడదు. తప్పకుండా కాటన్ దుస్తులు, కాస్త లూస్‌గా ఉన్నవి మాత్రమే దరించాలి. ఎక్కువ చల్లటి నీరు కూడా తీసుకోకూడదు. ఇది బిడ్డ ఆరోగ్యానికి, మీ ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు.

3 / 5
ప్రతి రోజూ, రెండు సార్లు ఉదయం, సాయంత్రం గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలి. మసాలా ఫుడ్‌కు చాలా దూరం ఉండాలి. కూల్ డ్రింక్స్ అస్సలే తాగకూడదు. అలాగే ఎక్కువ చెమట వచ్చే పనులు చేయకూడదు. ఎప్పటికప్పుడు తడి క్లాత్‌లో శరీరాన్ని తుడుచుకోవాలి. తప్పకుండా కనీసం 10 నిమిషాలు వాకింగ్ చేయాలి. అలాగే తీవ్రమైన తలనొప్పి, తలతిరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, బేబీ మూమెంట్స్ తెలియకపోతే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.

4 / 5
నోట్ : పై సమాచారం కేవలం ఆరోగ్య నిపుణులు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, ప్రథమంగా వైద్యుడిని సంప్రదించడమే ఉత్తమం. ఇది కేవలం సలహా మాత్రమే అని పాఠకులు గమనించాలి.

5 / 5
Follow Us