AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTD Vedha Vignana Peetham Admissions 2026: శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠములో ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. ఎలా దరఖాస్తు చేయాలంటే

తితిదే పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం.. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దర్మగిరి (తిరుమల), కీసర గుట్ట, విజయనగరం, ఐ.భీమవరం, నల్గొండ, కోటప్పకొండ వేద విజ్ఞాన పీఠముల్లో వివిధ కోర్సుల్లోహిందూ వైదిక సంప్రాదాయం..

TTD Vedha Vignana Peetham Admissions 2026: శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠములో ప్రవేశాలకు నోటిఫికేషన్‌.. ఎలా దరఖాస్తు చేయాలంటే
TTD Vedha Vignana Peetham Admissions
Srilakshmi C
|

Updated on: May 21, 2026 | 9:43 AM

Share

తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు (తితిదే) పరిధిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం.. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దర్మగిరి (తిరుమల), కీసర గుట్ట, విజయనగరం, ఐ.భీమవరం, నల్గొండ, కోటప్పకొండ వేద విజ్ఞాన పీఠముల్లో వివిధ కోర్సుల్లోహిందూ వైదిక సంప్రాదాయం ప్రకారం ఉమనయనం అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన వారు మే 31, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఋగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం, దివ్యప్రబంధం, వైఖానసాగమం, తంత్రసారాగమం, కృష్ణయజుర్వేద స్మార్తం, పాంచరాత్ర ఆగమం, చాత్తాద శ్రీ వైష్ణవ ఆగమం, శైవాగమం, ఆపస్తంబ పౌరోహిత్యం, పాంచరాత్రాగమం తదితర కోర్సుల్లో ప్రవేవాలు పొందవచ్చు.

ఈ కోర్సుల్లో దరఖాస్తు చేసుకోవాలంటే ఐదు, ఏడో తరగతి విద్యార్హత కలిగిన వారు అర్హులు. అలాగే ఉపనయనం అయి ఉండాలి. ఐదో తరగతి విద్యార్ధుల వయసు జులై 1, 2014 నుంచి జూన్‌ 30, 2016 మధ్య జన్మించి ఉండాలి. ఏడో తరగతి విద్యార్ధుల వయసు జులై 1, 2012 నుంచి జూన్‌ 30, 2014 మధ్య జన్మించి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు మే 31, 2026వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అభ్యర్ధులు తితిదే వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు ఫాంను పూర్తి చేసి ఈ కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది.

అడ్రస్..

యస్‌.వి.వేద విజ్ఞాన పీఠం, ధర్మపురి, కోటప్పకొండ, భీమవరం, విజయనగరం, కీసరగుట్ట – మేడ్చల్‌ మల్కాజిగిరి, నల్గొండ జిల్లాల సంబంధిత చిరునామాలకు పోస్టు ద్వారా పంపించాలి.

శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠములో అడ్మిషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us