AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..! శాస్త్రవేత్తల సరికొత్త ప్రయోగం

కొలొరెక్టల్ క్యాన్సర్ చికిత్సలో జపాన్ శాస్త్రవేత్తలు విప్లవాత్మక ఆవిష్కరణ చేశారు. కప్ప పేగులలోని 'ఎవింగెల్లా అమెరికానా' బ్యాక్టీరియా ట్యూమర్‌లను 100% తొలగిస్తుందని కనుగొన్నారు. కీమోథెరపీ వంటి దుష్ప్రభావాలు లేకుండా, ఈ కొత్త పద్ధతి యువతలో పెరుగుతున్న క్యాన్సర్ కేసులకు ఆశలు రేపుతోంది. ఇది ప్రకృతి నుండి లభించే కొత్త ఔషధాల సామర్థ్యాన్ని చూపిస్తుంది.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..! శాస్త్రవేత్తల సరికొత్త ప్రయోగం
Anti Cancer Drug
Jyothi Gadda
|

Updated on: Dec 27, 2025 | 1:43 PM

Share

క్యాన్సర్.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. క్యాన్సర్‌ ప్రస్తావ రాగానే ప్రజలు భయబ్రాంతులకు గురవుతారు. ఆధునిక కాలంలో మారుతున్న జీవనశైలితో ప్రపంచ వ్యాప్తంగా కొలొరెక్టల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా యువతలో వేగంగా పెరుగుతోంది. కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ వంటి సాంప్రదాయ చికిత్సలు ఉన్నప్పటికీ, చాలా సందర్భాలలో సక్సెస్‌ రేటు తక్కువగానే ఉంటుంది. అయితే, జపనీస్ శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురాచ్చనే ఆవిష్కరణ చేశారు. ఒక చిన్న కప్ప ప్రేగులలో జరిగింది.

న్యూయార్క్ పోస్ట్‌లోని ఒక నివేదిక ప్రకారం, జపాన్ అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (JAIST) పరిశోధకులు జపనీస్ చెట్ల కప్పల పేగులలో కనిపించే బ్యాక్టీరియాను పరిశీలించారు. జపనీస్‌ ట్రీ కప్పలు, ఫైర్-బెల్లీ న్యూట్స్, గడ్డి బల్లుల సహా మొత్తం 45 వేర్వేరు బాక్టీరియా జాతులను పరీక్ష కోసం ఉపయోగించారు. ఇందులో తొమ్మిది బాక్టీరియల్ జాతులు యాంటీ-ట్యూమర్ ప్రభావాలను కలిగి ఉన్నాయని కనుగొన్నారు. అమెరికానా బ్యాక్టీరియాను ప్రయోగించిన ఎలుకల్లో క్యాన్సర్‌ కణితులు పూర్తిగా 100శాతం మాయం చేసిందని గ్రహించారు. అంతేకాదు.. చికిత్స అనంతరం ఆరోగ్యవంతంగా మారిన ఎలుకల శరీరంలోకి మరోసారి క్యాన్సర్ కణాలు ప్రవేశ పెట్టారు. అయితే అనూహ్యంగా అవి అభివృద్ధి చెందకుండా అదృశ్యమైపోయాయి. ఇది సాంప్రదాయ చికిత్సల కంటే చాలా ఎక్కువ.

ఈ బ్యాక్టీరియా క్యాన్సర్ కణాలను నేరుగా నాశనం చేస్తుంది. అదే సమయంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది వాపును నివారిస్తుంది. 24 గంటల్లోపు రక్తప్రవాహం నుండి బ్యాక్టీరియా మాయం చేస్తుంది. అంతేకాదు.. కీమో థెరపీ ఔషధాల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధకులు తేల్చారు. కీమోథెరపీ తీవ్రమైన దుష్ప్రభావాలతో పోలిస్తే, ఎవింగెల్లా అమెరికానా చాలా సురక్షితమైనదిగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ బ్యాక్టీరియా కణితిలో మాత్రమే పేరుకుపోతుంది. ఇతర అవయవాలకు వ్యాపించదు.

ఇవి కూడా చదవండి

యునైటెడ్ స్టేట్స్‌లో ప్రతి సంవత్సరం సుమారు 150,000 మందికి కొలొరెక్టల్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది. ఈ రేటు ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువ. ఈ వ్యాధి గతంలో వృద్ధులలో ఎక్కువగా కనిపించేది. కానీ ఇప్పుడు యువకులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఇది వైద్యులను సైతం ఆందోళన కలిగించే అంశం. 2019లో 20శాతం కేసులు 55 ఏళ్లలోపు వారిలోనే గుర్తించారు.. తత్ఫలితంగా 2021లో స్క్రీనింగ్ వయస్సు 50 నుండి 45కి తగ్గించబడింది.

పరిశోధకులు ఇప్పుడు ఈ బాక్టీరియను రొమ్ము, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వంటి ఇతర క్యాన్సర్లపై పరీక్షించనున్నారు. డోస్ ఫ్రాక్షనేషన్, డైరెక్ట్ ట్యూమర్ ఇంజెక్షన్ వంటి సురక్షితమైన డెలివరీ పద్ధతులను కూడా వారు పరిశీలిస్తారు. ఈ ఆవిష్కరణ ప్రకృతి జీవవైవిధ్యం.. కొత్త వైద్య సాంకేతిక పరిజ్ఞానాలకు నిజంగానే ఔషనిధిని కలిగి ఉందని నిరూపిస్తుందని పరిశోధకులు అంటున్నారు. దీనికి మరింత మెరుగైన పరిశోధనలు చేస్తున్నారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..