Singareni Mines: సింగరేణి గని ప్రమాదంలో లభ్యం కానీ ఆచూకీ.. ఆవేదనలో బాధిత కుటుంబాలు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి గని (Singareni Mine) లో జరిగిన ప్రమాదంలో ఇంకా నలుగురు అచూకీ లభ్యం కాలేదు. ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా వారి జాడ తెలియకపోవడం...
పెద్దపల్లి సింగరేణి గనిలో రెస్క్యూ ఆపరేషన్ సత్ఫలితాలనిస్తోంది. రవీందర్‌ను రెస్క్యూ సిబ్బంది సేఫ్‌గా కాపాడింది. గనిలోంచి రవీందర్ బయటకు రావడంతో తోటి కార్మికులతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మరో ముగ్గురు కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్‌ని మరింత స్పీడప్ చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్టూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో రవీందర్ తనను కాపాడాలంటూ కేకలు వేశారు. దీంతో ఆపరేషన్‌ను వేగవంతం చేసి ఆతన్ని సేఫ్‌గా కాపాడారు. గనిలో చిక్కుకుపోయిన తేజ, జయరాజ్, శ్రీకాంత్ కోసం గాలింపు కొనసాగుతోంది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి గని (Singareni Mine) లో జరిగిన ప్రమాదంలో ఇంకా ముగ్గురి అచూకీ లభ్యం కాలేదు. ఘటన జరిగి 24 గంటలు గడుస్తున్నా వారి జాడ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహాయకచర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
అయితే గని లోపలి నుంచి ఇద్దరి మాటలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. నీరు, ఆహారం లేకపోవడంతో వారి పరిస్థితి ఎలా ఉందోనని కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. గని లోపల చిక్కుకున్న వారు సురక్షితంగా బయటకు వస్తారో లేదనని ఆందోళన చెందుతున్నారు. రామగుండం-3 (Ramagundam) పరిధిలోని అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు భూగర్భ గనిలో సోమవారం మధ్యాహ్నం సైడు, పైకప్పు కూలిన ప్రమాదంలో ఇద్దరు అధికారులు సహా ఆరుగురు ఉద్యోగులు చిక్కుకున్నారు. వారిలో ఇద్దరు రాత్రి 7 గంటల ప్రాంతంలో సురక్షితంగా బయటపడ్డారు. మరొకరు ఇవాళ ఉదయం బయటకు రాగా ముగ్గురూ బొగ్గు శిథిలాల కిందే చిక్కుకుపోయారు.
గనిలోని 86 లెవల్ వద్ద వారం రోజుల క్రితం పైకప్పు కూలింది. దాన్ని సరిచేసేందుకు సోమవారం ఉదయం 7 గంటలు, 9 గంటల షిఫ్టు ఉద్యోగులతో పనులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో బొగ్గుబండ కూలింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న అధికారి జయరాజ్, గని అసిస్టెంట్ మేనేజర్ చైతన్యతేజ, బదిలీ వర్కర్ రవీందర్, ఒప్పంద కార్మికుడు తోట శ్రీకాంత్‌లతో పాటు వెంకటేశ్వర్లు, నరేశ్‌లు చిక్కుకున్నారు. అందులో వెంకటేశ్వర్లు, నరేశ్‌లను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. మిగతా నలుగురిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
Also Read
Viral Video: చేతిలో బొమ్మ.. ఒంటరిగా బాలుడు ఏడుస్తూ సరిహద్దులు దాటుతూ.. కన్నీరు పెట్టించిన దృశ్యం!
Crime news: ఇంట్లో చెలరేగిన మంటలు.. చిన్నారి సహా ఐదుగురు సజీవ దహనం