Viral Video: చేతిలో బొమ్మ.. ఒంటరిగా బాలుడు ఏడుస్తూ సరిహద్దులు దాటుతూ.. కన్నీరు పెట్టించిన దృశ్యం!

యుద్ధ భీతితో ఎందరో దేశం విడిచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ చిన్నారి తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ చిన్నారి దేశం వదిలి వెళ్లిపోతున్న దృశ్యం అందరినీ కలచివేసింది

Viral Video: చేతిలో బొమ్మ.. ఒంటరిగా బాలుడు ఏడుస్తూ సరిహద్దులు దాటుతూ.. కన్నీరు పెట్టించిన దృశ్యం!
Ukraine Border
Follow us

|

Updated on: Mar 08, 2022 | 11:15 AM

Russia Ukraine War: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఈరోజు 13వ రోజు. మరోవైపు రెండు దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. యుద్ధంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది పౌరులు గాయపడ్డారు. యుద్ధ భీతితో ఎందరో దేశం విడిచి వెళ్లిపోతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ చిన్నారి(Little Boy) తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ చిన్నారి దేశం వదిలి వెళ్లిపోతున్న దృశ్యం అందరినీ కలచివేసింది. రష్యా(Russia) దాడులకు భయపడి ఉక్రెయిన్ సరిహద్దు(Ukraine Border)లో ఒంటరిగా ఏడ్చుకుంటూ వలస పోతున్నాడు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్థానిక కథనం ప్రకారం, శనివారం నాడు మెడికా పట్టణంలోని పోలిష్ సరిహద్దులో ఒంటరిగా ఒక బాలుడు నడుచుకుంటూ వస్తున్న దృశ్యం వెలుగులోకి వచ్చింది. తానూ బార్డర్ దాటుతూ ఒంటరిగా తనకు తానుగా ఏడుస్తున్న వీడియో బయటపడింది. అతను క్యారియర్ బ్యాగ్‌లో రక్‌సాక్, ఆడుకునే బొమ్మను వెంట తీసుకువెళుతున్నాడు. ఉక్రెయిన్ వరుస దాడులతో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. తల్లి, తండ్రి, పిల్లలు తలో దిక్కులో చిక్కుకుపోయారు. ఈక్రమంలోనే ఈ పిల్లాడు దేశం విడిచి సరిహద్దులు దాటుతున్నట్లు ఈ దృశ్యం కనిపించింది. అయితే, అతను కుటుంబంతో ఉన్నాడా లేడా అనేది స్పష్టంగా తెలియలేదు. కాగా సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. రష్యా కర్కశత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.

ఇదిలావుంటే, ఇదిలా ఉంటే, ఉక్రెయిన్‌కు చెందిన మరో 11ఏళ్ల చిన్నారి తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఏకంగా 1,000 కి.మీ.నడుచుకుంటూ వెళ్లాడు. ఆ బాలుడు 1,000 కిమీ ప్రయాణించిన తర్వాత స్లోవేకియాను దాటాడు. ఇంత దూరం ప్రయాణించిన ఈ చిన్నారి చేతిలో బ్యాగ్‌ప్యాక్, అతని తల్లి నోట్, టెలిఫోన్ నంబర్ మాత్రమే ఉన్నాయి. బాలుడు ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని జాపోర్జియా నివాసి అని భద్రతా సిబ్బంది గుర్తించింది. రష్యా సైన్యం గత వారం జాపోర్జియాలోని పవర్ ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, యుద్ధం మధ్యలో, అనారోగ్యంతో ఉన్న బంధువును చూసుకోవడానికి ఈ బిడ్డ తల్లిదండ్రులు అక్కడే ఉండవలసి వచ్చింది. కానీ ఈ యుద్ధంలో చిక్కుకోకుండా తన పిల్లలను కాపాడాలని ఆమె కోరుకుంది. అదే సమయంలో, ఈ చిన్నారి అద్భుతమైన ప్రయాణం గురించి సమాచారం అందిన వెంటనే, స్లోవేకియా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ఇంటీరియర్ మినిస్ట్రీ బాలుడి నిర్భయత, దృఢనిశ్చయాన్ని ప్రశంసించింది. అతని తల్లిదండ్రులు ఉక్రెయిన్‌లో నివసించవలసి ఉన్నందున అతను చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్, పాస్‌పోర్ట్, ఫోన్ నంబర్‌తో పూర్తిగా ఒంటరిగా వచ్చాడు. అక్కడ ఉన్న అధికారి రాజధాని బ్రాటిస్లావాలోని అతని బంధువులను సంప్రదించి వారికి బిడ్డను అప్పగించారు. Read Also…. 

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. 11 ఏళ్ల బాలుడు 1000 కి.మీలు ఒంటరిగా ప్రయాణించాడు..!

Latest Articles