రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. 11 ఏళ్ల బాలుడు 1000 కి.మీలు ఒంటరిగా ప్రయాణించాడు..!

Russia Ukraine Crisis: ఓ వైపు బాంబుల మోత మోగుతోంది. ఏ క్షిపణి ఎటువైపు నుంచి వచ్చి పడుతుందో ఊహించలేని పరిస్థితి ఉంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్.. 11 ఏళ్ల బాలుడు 1000 కి.మీలు ఒంటరిగా ప్రయాణించాడు..!
Boy Slovakia
Follow us

|

Updated on: Mar 08, 2022 | 8:28 AM

Russia Ukraine Crisis: ఓ వైపు బాంబుల మోత మోగుతోంది. ఏ క్షిపణి ఎటువైపు నుంచి వచ్చి పడుతుందో ఊహించలేని పరిస్థితి ఉంది. అడుగు ముందుకేస్తే ప్రాణాలతో ఉంటామో ఉండమో అనే భయం. ఈ పరిస్థితుల్లో.. ఉన్న చోట నుంచి బయటకు వెళ్లలేక.. అలాగని ఉన్నచోటే ఉండిపోలేక బిక్కు బిక్కుమంటూ బతికేస్తున్నారు ఉక్రెయిన్ ప్రజలు. రష్యా దాడులతో అతలాకుతలం అవుతోంది ఉక్రెయిన్ జనజీవనం. అయితే, ఈ భీకర యుద్ధ పరిస్థితులను చూసి జనాలంతా భయపడుతున్న వేళ.. ఒక్కడు ధైర్యంగా ముందుకు కదిలాడు. అది కూడా కేవలం 11 ఏళ్ల బాలుడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 1000 కిలోమీటర్లు ఒంటరిగా ప్రయాణించాడు.

ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ప్రజలు తమ పిల్లలను, కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే తల్లి తన కొడుకు ప్రాణాలతో ఉంటే చాలు అనుకుని.. తన 11 ఏళ్ల కుమారుడిని ట్రైన్‌లో సురక్షిత ప్రాంతానికి పంపించింది. చిన్నారి చేతిపై పోన్ నెంబర్ రాసి.. రైలెక్కించింది. అలా ట్రైన్ ఎక్కిన బాలుడు.. 1,000 కిలోమీటర్లు ప్రయాణించి దేశం దాటేశాడు. స్లోవేకియా దేశానికి చేరుకున్నాడు.

అయితే, అక్కడ ఒంటరిగా వచ్చిన బాలుడిని స్లోవేకియా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రుల గురించి ఆరా తీశారు. ఈశాన్య ఉక్రెయిన్‌లోని జపోరిషియా నుంచి ఈ బాలుడు వచ్చిన గుర్తించిన అధికారులు.. అమ్మ,నాన్నలు ఎవరూ రాలేదని, బాలుడు ఒక్కడినే పంపించారని గుర్తించారు. బాలుడి చేయిపై ఉన్న ఫోన్ నెంబర్‌ను తీసుకున్నారు. ఆ ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసి.. బాలుడిని అతని బంధువులు క్షేమంగా అప్పగించారు.

కాగా, ఈ బాలుడి ప్రయాణానికి సంబంధించి.. స్లోవేకియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫేస్‌బుక్‌లో వెల్లడించింది. వెల్లడించింది. ‘‘జపోరిషియా నుంచి ఓ 11 ఏళ్ల బాలుడు ఒంటరిగా స్లోవేకియా చేరుకున్నాడు. అతడి వద్ద ఒక ప్లాస్టిక్‌ బ్యాగ్, పాస్‌పోర్టు, చేతిపై ఫోన్‌ నంబరు మాత్రమే ఉన్నాయి. ఆ నంబరు సాయంతోనే తన బంధువులను సంప్రదించి బాలుడిని అప్పగించాం. కథ సుఖాంతమైంది’’ అని పేర్కొంది. కాగా, బాలుడి చేతిపై ఫోన్‌ నంబరుతో పాటు ఓ చిన్న చీటి కూడా ఇచ్చి పంపించింది అతని తల్లి. అందులో స్లోవేకియా అధికారులు, పోలీసులు తన కుమారుడిని కాపాడాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలిపింది.

కాగా, బాలుడి కుటుంబ సభ్యులు ఒకరు అనారోగ్యంతో బాధపడున్నారట. ఆ కారణంగానే బాలుడి తల్లిదండ్రులు ఉక్రెయిన్‌లోనే ఉండిపోవాల్సి వచ్చిందట. ఓ వైపు యుద్ధం కొనసాగుతుండటం, మరోవైపు ఇంట్లో అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో తమ కుమారుడిని అయినా కాపాడుకోవాలని ఆ తల్లిదండ్రులు భావించి.. స్లోవేకియాలో ఉన్న తమ బంధువుల ఇంటికి చిన్నారిని పంపించారు.

Also read:

News Watch: అంటే.. మోదీ హ్యాట్రిక్ కొడుతున్నారా ?? మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Viral Photo: మీకో సవాల్.. ఈ ఫోటోలో అందమైన జంతువు దాగుంది.. అదేంటో కనిపెట్టే శక్తి మీకుందా?

RRB NTPC row: ఈ విషయంపై త్వరలోనే పరిష్కారం సూచిస్తాం.. రైల్వే శాఖ మంత్రి!