AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medical Education: విదేశాల్లో మెడిసిన్‌ చదవడానికి దేశ యువత మొగ్గు చూపడానికి అసలు కారణం ఇదే.. దౌర్భాగ్యస్థితిలో మన చదువులు!

మెడిసిన్‌ విద్య (Medical seat reservation system) మనదేశంలోనే చదవండి, చిన్న చిన్న ఫారిన్‌ కంట్రీల్లో చదవొద్దని ప్రధాని మోదీ స్టేట్‌మెంట్ ఇవ్వడం హాస్యాస్పదం.. అందుకే మెడికల్ ఎడ్యుకేషన్ ఇలా ఉంది?

Medical Education: విదేశాల్లో మెడిసిన్‌ చదవడానికి దేశ యువత మొగ్గు చూపడానికి అసలు కారణం ఇదే.. దౌర్భాగ్యస్థితిలో మన చదువులు!
Medical Education
Srilakshmi C
|

Updated on: Mar 09, 2022 | 7:20 AM

Share

Why Medical Education Very Cheap in Ukraine- Know Interesting Facts: భారతీయ విద్యార్థులు వైద్య విద్య (Medical Education In India)ను అభ్యసించడానికి పెద్ద సంఖ్యలో విదేశాలకు వెళ్లడానికి గత ప్రభుత్వమేకారణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం (మార్చి 3) విమర్శలు కురిపించారు. వైద్య విద్యనభ్యసించడానికి అనుగుణంగా తమ ప్రభుత్వం దేశంలో మెడికల్‌ కాలేజీల సంఖ్యను పెంచడానికి విశేషంగా కృషి చేస్తోందని ఈ సందర్భంగా నొక్కిఒక్కానించారు. అసలు వైద్య విద్యా విధానాలు సరిగ్గా ఉంటే ఇంత మంది విద్యార్ధులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, చిన్న వయసులోనే తమ పిల్లలు విదేశాలకు వెళ్లాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరన్నారు. గతంలో 300 నుంచి 400 మెడికల్ కాలేజీలు ఉండేవని, ప్రస్తుతం వాటి సంఖ్య దాదాపు 700కి చేరుకుందని ప్రధాని మోదీ చెప్పారు. తాము అందించే సీట్ల సంఖ్య 80,000-90,000 నుంచి 1.5 లక్షలకు పెరిగిందని ఆయన చెప్పారు. ప్రధాని మోదీ ప్రసంగం ఇలా ఉంటే.. ఉక్రెయిన్ సంక్షోభం (Ukraine crisis) వెలుగులోకి వచ్చే వరకు బీహార్‌తో సహా దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రతి సంవత్సరం విదేశాలకు వెళ్లి వైద్య కోర్సులు అభ్యసించే విద్యార్ధుల సంఖ్య ఇంతపెద్ద సంఖ్యలో ఉందని ఇప్పటివరకు మాకు తెలియదని. .. దాదాపు 17 ఏళ్లపాటు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మన దేశ రాజీకీయ నియకుల్లో ఈ స్థాయిలో అవగాహన రాహిత్యం ఉంటుందని అసలూహించలేదు. మరోవైపు మెడిసిన్‌ విద్య (Medical seat reservation system) మనదేశంలోనే చదవండి, చిన్న చిన్న ఫారిన్‌ కంట్రీల్లో చదవొద్దని ప్రధాని మోదీ స్టేట్‌మెంట్ ఇవ్వడం ఇంకా హాస్యాస్పదంగా ఉంది.

ఉక్రెయిన్ సంక్షోభం వల్ల దేశంలో వైద్య విద్య స్థితిగతులపై అందరు దృష్టి సారించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అందించిన డేటాను పరిశీలిస్తే అసలు సమస్య ఎక్కడ మొదలైందో తెలుస్తుంది. ఈ డేటా ప్రకారం.. ప్రతి సంవత్సరం 25,000 మంది విద్యార్థులు మెడిసిన్ చదవడానికి విదేశాలకు వెళ్తున్నారు. 2021లో 16.1 లక్షల మంది అభ్యర్థులు ఎంబీబీఎస్‌ ప్రవేశ పరీక్షలకు హాజరైతే.. ఈ సంఖ్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జాతీయ వైద్య కమిషన్ కేవలం 90,000 సీట్లు మాత్రమే అందిస్తోంది. సమస్యకు మూలం కూడా ఇదే!

దేశంలో 562 మెడికల్‌ కాలేజీలు ఎంబీబీఎస్‌ కోర్సును అందిస్తుండగా వీటిల్లో 286 ప్రభుత్వ కాలేజీలు, 276 ప్రైవేట్‌ కాలేజీలున్నాయి. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు కేటగిరీల వారీగా రిజర్వేషన్ కోటను అమలుచేయడం వల్ల, దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు సరిపడ ఓపెన్‌ కేటగిరీ సీట్ల సంఖ్య చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఇక ప్రైవేట్ కాలేజీల్లో సీట్ల డిమాండ్‌ (అధిక ఫీజులతో కూడిన సీట్లు)కు తాలలేని విద్యార్ధులు విదేశాలవైపు చూస్తున్నారు. మన దేశంలో ప్రైవేట్ వైద్య విద్య ఖర్చు రూ.1 కోటికి పైనే ఉంటుంది. ఈ ఖర్చులో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు కొంత భాగాన్ని మాత్రమే వసూలు చేస్తాయి. ఐతే ప్రభుత్వకాలేజీల్లో తగినన్ని ఓపెన్ కేటగిరీ సీట్లు లేవు.

ఈ తలనొప్పులతో వేగలేక మెడిసిన్‌ చదవాలనుకునేవారు నేరుగా ఉక్రెయిన్, చైనా, రష్యా వంటి దేశాల్లో మెడిసిన్‌ చదవాలనుకుంటున్నారు. ఈ దేశాల్లో మెడిసిన్‌ మొత్తం కోర్సు చదవడానికి కేవలం రూ.20-25 లక్షలు మాత్రమే ఖర్చవుతాయి. తక్కువ ఫీజులతో పాటు, బెటర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (మెరుగైన మౌలిక సదుపాయాలు), newer and evolved patterns of study విధానాలు మన విద్యార్థులను అమితంగా ఆకర్షిస్తున్నాయి.

ఉదాహరణకు.. ఇతర యూరోపియన్ దేశాలతో పోలిస్తే, ఉక్రెయిన్ ఔషధ రంగంలో అత్యధిక సంఖ్యలో యూజీ, పీజీ స్పెషలైజేషన్లను అందిస్తుంది. హత్యకు గురైన మెడికల్ విద్యార్థి నవీన్ శేఖరప్ప తండ్రి కుమారుడి మరణానంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రీ యూనివర్సిటీ కోర్సులో నా కొడుకు 97 శాతం స్కోర్ సాధించినప్పటికీ.. రాష్ట్రంలో మెడికల్ సీటు పొందలేకపోయాడు. మెడికల్ సీటు రావాలంటే కోట్ల డబ్బు కుమ్మరించాలి. తక్కువ డబ్బుతో విదేశాలలో ఇదే విద్యను చదువుతున్నారనేది ఒక కారణం. మరొక కారణం ఎంటంటే..

ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ చదివి దేశానికి తిరిగి వచ్చిన విద్యార్థులు ఇక్కడ ప్రాక్టీస్‌ మెదలు పెట్టాలంటే నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (NBE) నిర్వహించే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ (FMGE) రాయాలి. ఈ పరీక్షలో అర్హత సాధిస్తేనే లైసెన్స్ వస్తుంది. దీనికోసం పదేపదే ప్రయత్నించడంకన్నా యూరోపియన్ దేశాల్లో తమ కెరీర్‌ను ప్రారంభించడం చాలా ఈజీ అనేది మరొక కారణం. ఉక్రెయిన్‌లో ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్‌ సంఖ్య పెరగడంతో ఆ దేశం మెడికల్‌ ఎడ్యుకేషన్‌కు ఫేమస్‌ అయ్యింది.

ఉక్రెయిన్‌లోని యూనివర్సిటీలన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO)చే ఆమోదించబడినవి. అంతేకాకుండా.. పాకిస్తాన్ మెడికల్ అండ్ డెంటల్ కౌన్సిల్, యూరోపియన్ కౌన్సిల్ ఆఫ్ మెడిసిన్, యూకేకు చెందిన జనరల్ మెడికల్ కౌన్సిల్ కూడా ఉక్రేనియన్ మెడికల్ డిగ్రీలను గుర్తిస్తాయి. ఐతే మన దేశంలో మాత్రం ఎందుకు గుర్తించబడవు?

వైద్య విద్యలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే విధానాలను రూపొందించాలి.. ఎందుకంటే.. దేశంలో వైద్య విద్య ఖర్చును తగ్గించాలంటే ప్రైవేట్ పెట్టుబడిని ఆకర్షించే విధానాలను రూపొందించడం తక్షణ అవసరం. డిమాండ్-సరఫరా నిష్పత్తిని బట్టి ఈ లెక్కలను సరిచేయడం తప్పనిసరి. 2020 జాతీయ విద్యా విధానం జీడీపీలో 6 శాతం వరకు ప్రభుత్వ పెట్టుబడిని కోరింది. దురదృష్టవశాత్తు.. ఈ ఏడాది (2021-22) విద్యపై వ్యయం కేవలం 3.1 శాతం మాత్రమే ఉంది..

ప్రధానమంత్రి స్టేట్‌మెంట్ ఇచ్చినప్పటికీ.. దేశంలో నాణ్యమైన విద్యపై ప్రభుత్వ వ్యయం సగటు కంటే కూడా చాలా తక్కువగా ఉంది. గత ఏడేళ్లలో దేశంలో మెడికల్‌ కాలేజీల సంఖ్య 54 శాతం పెరిగాయని ప్రధాని అంటున్నారు. ఈ కొత్త కాలేజీల్లో ఇప్పటికీ ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా నిరుపయోగంగానే ఉన్నాయి. జనవరి 2022 నాటికి 5 ఎయిమ్స్ కాలేజీలు ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్, గోవా, కర్ణాటక, కేరళ, మిజోరాం, త్రిపురలలో కూడా ఎయిమ్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవి పూర్తయ్యేదెప్పుడు.. విద్యనందించేదెప్పుడు? ఇక దేశంలో డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కలలుకనే విద్యార్ధుల పరిస్థితేంటి? తమ కలలను సాకారం చేసుకోవడానికి ఇతర మార్గలకోసం వెతకడం సహజమే కదా!

విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్ధులు అపఖ్యాతి పాలవ్వడానికి కారణం.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) ప్రత్యేక ప్రవేశ పరీక్ష విధానం వారికి లేకపోవడం. నీట్‌ పరీక్షకు ఏటా లక్షల మంది హాజరవుతుండగా, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 40 వేల మంది మాత్రమే ప్రవేశాలు పొందుతున్నారు. నీట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు సీటు రాకపోవడంతో ఉక్రెయిన్ వంటి ఫారిన్ కంట్రీల వైపు మొగ్గు చూపుతున్నారు. నిజానికి ఈ వాదనలు కూడా న్యాయమైనవే. అందుకే మెడికల్ ప్రవేశ పరీక్షను తమిళనాడు ప్రభుత్వం నిరంతరం వ్యతిరేకిస్తోంది. నీట్‌ వల్ల గ్రామీణ, పేద విద్యార్థులు వైద్యులుగా మారకుండా అడ్డుకుంటుందని వాదిస్తోంది. దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్ష జరగడానికి ముందు, తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాలు జరిగేవి. 2017లో సుప్రీంకోర్టులో నీట్ పరీక్షకు వ్యతిరేకంగా పోరాడిన 17 ఏళ్ల అనిత ఆత్మహత్యతో రగులుకున్న వివాదం ఇంకా సెగలు కక్కుతూనే ఉంది. నీట్‌ పరీక్ష పూర్తిగా సీబీఎస్సీ మాడ్యూల్‌లో ఉండటమే అందుకు కారణం. ఈ కారణంగా 12వ తరగతి వరకు స్టేట్‌ సిలబస్‌ చదివిన విద్యార్ధులు వైద్య విద్యకు దూరంకావాల్సి వస్తుంది. కేవలం సీబీఎస్సీ బోర్డు స్టూడెంట్స్‌కు మాత్రమే నీట్‌ ప్రయోజనకారి. ఇది మన వైద్య విద్య చరిత్ర!

– మేథ దత్త యాదవ్‌.

Also Read:

FACT Recruitment 2022: ఇంజనీర్‌ గ్రాడ్యుయేట్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..నెలకు రూ.75,000ల వరకు జీతం..