ICC Women World Cup 2022: 25 ఏళ్లనాటి రికార్డు బద్దలు.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న జోడీ..

International Women's Day: వీరిద్దరూ ప్రపంచకప్ చరిత్రలో 25 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టారు. అద్భుతమైన బ్యాటింగ్, భాగస్వామ్యంతో ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించారు.

ICC Women World Cup 2022: 25 ఏళ్లనాటి రికార్డు బద్దలు.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న జోడీ..
International Women's Day Pakistan Vs Australia
Follow us
Venkata Chari

| Edited By: Anil kumar poka

Updated on: Mar 08, 2022 | 2:59 PM

Pakistan Vs Australia Women Cricket: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women’s Day). ఈ ప్రత్యేక సందర్భంలో ఇద్దరు పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు తుఫాన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. బిస్మా మరూఫ్‌ (Bismah Maroof) , అలియా రియాజ్‌(Aliya Riaz)లు కలిసి పాకిస్థాన్‌ తరఫున సరికొత్త రికార్డు సృష్టించారు. వీరిద్దరూ ప్రపంచకప్ చరిత్రలో 25 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టారు. అద్భుతమైన బ్యాటింగ్, భాగస్వామ్యంతో ఆస్ట్రేలియాపై ఈ ఘనత సాధించారు. ప్రపంచకప్ పిచ్‌పై 1997 తర్వాత పాకిస్థాన్‌కు ఏ మహిళా బ్యాట్స్‌మెన్ చేయని పనిని వీరిద్దరూ చేశారు. భాగస్వామ్య పరంగా మహిళల ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్ తరఫున బిస్మా, అలియా సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ విషయంలో వీరిద్దరూ కలిసి 25 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. ఈ రికార్డును బద్దలు కొట్టేటప్పుడు, బిస్మా, అలియా ఇద్దరూ తమ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లకు స్క్రిప్ట్‌లు రాశారు.

బద్దలైన 25 ఏళ్ల రికార్డు..

ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో బిస్మా మరూఫ్, అలియా రియాజ్ మధ్య 5వ వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ప్రపంచకప్ పిచ్‌లో ఏ వికెట్‌కైనా పాకిస్థాన్‌కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యంగా నిలిచింది. అంతకుముందు 1997 సంవత్సరంలో, మలీహా హొస్సేన్, షర్మిన్ ఖాన్ మధ్య 84 పరుగుల భాగస్వామ్యం సాధించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన ODIలలో దీనిని సాధించారు.

బిస్మా, అలియా ఇద్దరూ అర్ధ సెంచరీలు..

ఈ మ్యాచ్‌లో బిస్మా మరుఫ్ 122 బంతుల్లో 8 ఫోర్లతో అజేయంగా 78 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాతో మహిళల వన్డేలో పాక్ బ్యాట్స్‌మెన్ సాధించిన అత్యధిక స్కోరు ఇదే. అదే సమయంలో, ప్రపంచకప్ పిచ్‌పై పాకిస్థానీ చేసిన రెండో భారీ స్కోరుగా నిలిచింది. ఇది బిస్మా వన్డే కెరీర్‌లో 15వ అర్ధ సెంచరీ.

మరో ఎండ్‌లో అలియా రియాజ్ 53 పరుగులు..

మరో ఎండ్‌లో అలియా రియాజ్ 109 బంతులు ఎదుర్కొని 53 పరుగులు చేసింది. ప్రపంచకప్‌లో ఆమెకిదే తొలి హాఫ్ సెంచరీ. వన్డే క్రికెట్‌లో 5వ హాఫ్ సెంచరీ సాధించింది.

Also Read: Watch Video: మైదానంలో పొట్టుపొట్టు తిట్టుకున్న షేన్ వార్న్, వెస్టిండీస్ ప్లేయర్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఆనాటి వీడియో..

India vs Sri Lanka 2nd Test: రెండో టెస్టులో కీలక మార్పులు.. జట్టులో చేరిన డే అండ్ నైట్ మ్యాచ్ స్పెషలిస్ట్ ప్లేయర్..

కష్టపడ్డ సొమ్ము ఎక్కడికిపోదు..! 72 చోరీ కేసుల్లో 102 మంది అరెస్ట్
కష్టపడ్డ సొమ్ము ఎక్కడికిపోదు..! 72 చోరీ కేసుల్లో 102 మంది అరెస్ట్
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
మీకు ఈ విషయం తెలుసా? బంగారం అమ్మేటప్పుడు ధర ఎందుకు తగ్గుతుంది?
మీకు ఈ విషయం తెలుసా? బంగారం అమ్మేటప్పుడు ధర ఎందుకు తగ్గుతుంది?
అతను మల్టి ఫార్మాట్ బౌలర్ గా ఎదగగలడు
అతను మల్టి ఫార్మాట్ బౌలర్ గా ఎదగగలడు
హోండా యాక్టివా ఈవీ విడుదలకు ముహూర్తం ఫిక్స్..!
హోండా యాక్టివా ఈవీ విడుదలకు ముహూర్తం ఫిక్స్..!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
ఆదివారం రోజు ఈ నివారణలు చేయండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ఆదివారం రోజు ఈ నివారణలు చేయండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!
ఆన్‌లైన్‌ లక్కీ డ్రాలో మీరే విజేత.. రూ.15లక్షలు, కారు మీ సొంతం..!
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
ఔట్ అయింది ఎవరు? వికెట్ తీసింది ఎవరు? ద్రావిడ్ ఆశక్తికర ప్రశ్న..
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం
శీతాకాలంలో కారు ప్రయాణమా..? ఇవి లేకుంటే చాలా ప్రమాదం