బ్రిటన్ లో చివరి డైనోసార్ల మనుగడ ! బయట పడిన కాలి ముద్రల శిలాజాలు ! కొనసాగుతున్న పరిశోధనలు
బ్రిటన్ లోని కెంట్ నగర శివార్లలో గల కొండ ప్రాంతాల్లో డైనోసార్ల (రాకాసి బల్లుల) పాదముద్రలు శిలాజాలను పరిశోధకులు కనుగొన్నారు. కొని కోట్ల సంవత్సరాల క్రితం అవి ఇక్కడ చివరిసారిగా తిరుగాడి ఉండవచ్చునని భావిస్తున్నారు.
బ్రిటన్ లోని కెంట్ నగర శివార్లలో గల కొండ ప్రాంతాల్లో డైనోసార్ల (రాకాసి బల్లుల) పాదముద్రలు శిలాజాలను పరిశోధకులు కనుగొన్నారు. కొని కోట్ల సంవత్సరాల క్రితం అవి ఇక్కడ చివరిసారిగా తిరుగాడి ఉండవచ్చునని భావిస్తున్నారు. అనంతరం ప్రకృతి వైపరీత్యాల కారణంగా క్రమేణా అంతరించిపోయి ఉండవచ్చునంటున్నారు. కెంట్ సిటీకి దూరాన గల ఫోక్ స్టోన్ పర్వత.. కొండ ప్రాంతాల్లో ఆరు వేర్వేరు డైనోసార్ జాతుల ఫుట్ ప్రింట్స్ ను కనుగొన్నామని హోస్టింగ్స్ మ్యూజియంకి చెందిన క్యూరేటర్, ఇతర పరిశోధకులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఈ శిలాజాలు కనబడడం ఇదే మొదటిసారని డేవిడ్ మార్టిల్ అనే పేలియొబయాలజీ ప్రొఫెసర్ తెలిపారు. సాధారణంగా భూగర్భ పరిశోధనలు చేసే తాము ఇక్కడ వీటిని చూసి ఆశ్చర్యపోయామన్నారు. ఈ ఫుట్ ప్రింట్స్ శిలాజాలు కొన్ని చిన్నగా..కొన్ని పెద్దగా ఉన్నాయని…కనీసం ఆరు జాతుల రాకాసి బల్లులు మందలు..మందలుగా ఇక్కడ తిరిగి ఉండవచ్చునని ఆయన చెప్పారు. కానీ ఒకేచోట ఇన్ని జాతుల డైనోసార్స్ ఉండడం అరుదన్నారు. బహుశా వీటిని ఆర్మర్డ్ థెరోపాడ్స్ జాతికి చెందినవిగా భావిస్తున్నామన్నారు.
మేము కనుగొన్న వాటిలో చాలావరకు దూరదూరంగా ఉన్న ఫాసిల్స్….ఆహారం కోసం అవి ఎంతదూరమైనా ప్రయాణించేవని తెలుస్తోంది…అంటే వీటినే మేం మైగ్రేషన్ రూట్స్ అని వ్యవహరిస్తాం అని డేవిడ్ పేర్కొన్నారు. తాము కనుగొన్న విశేషాలను ప్రొసీడింగ్స్ ఆఫ్ జియోలజిస్ట్స్ అసోసియేషన్ జర్నల్ లో ప్రచురించనున్నట్టు ఆయన చెప్పారు. కాగా..తాము మరిన్ని పరిశోధనలు చేస్తామని, ఏడాది పాటు అవి కొనసాగవచ్చునని డేవిడ్ పేర్కొన్నారు. కెంట్ సిటీ నుంచి మరికొంతమంది రీసెర్చర్లు ఇక్కడికి చేరుకొని పరిశోధనల్లో వీరికి సహకరించే అవకాశం ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: IND Vs NZ, WTC Final 2021 Day 3 Live: ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ టీమ్.. ఓపెనర్లుగా లాథమ్, డెవాన్ కాన్వే..
Telangana Corona: తెలంగాణలో తగ్గిన కరోనా వ్యాప్తి.. వెయ్యికి పడిపోయిన పాజిటీవ్ కేసుల సంఖ్య..