కరోనా భయమే మనిషి ప్రాణాలు తీస్తుంది..! అనుమానంతో పెరుగుతున్న ఆత్మహత్యలు

Fear of Man Kills : ప్రస్తుతం దేశంలో కరోనా ఉధృతి దారుణంగా ఉంది. రోజూ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

కరోనా భయమే మనిషి ప్రాణాలు తీస్తుంది..! అనుమానంతో పెరుగుతున్న ఆత్మహత్యలు
Fear Of Man Kills
Follow us
uppula Raju

|

Updated on: May 15, 2021 | 4:34 PM

Fear of Man Kills : ప్రస్తుతం దేశంలో కరోనా ఉధృతి దారుణంగా ఉంది. రోజూ అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్‌లో కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మృతదేహాలు కాల్చడానికి శ్మశానాల్లో స్థలం లేకుండాపోతుంది. మరోవైపు వాక్సిన్ బాధలు.. కొంతమంది వైద్య సిబ్బంది, నకిలీ డాక్టర్లు వ్యాక్సిన్ ను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ లేవు. కరోనా తీవ్రంగా ఉన్న పేషెంట్లకు ఆక్సిజన్ లేదు. అంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి విపత్కర సమయంలో మనల్ని మనం కాపాడుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం మనం ధృడంగా ఉండి కుటుంబ సభ్యులకు ధైర్యాన్నివ్వాలి.

జబ్బుతో కాదు మనుషులు భయంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. విజయనగరం జిల్లా నల్లబిల్లి గ్రామంలో కరోనా భయంతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెలుగు చూసింది. కుటుంబ పెద్ద గుప్తాకు కొద్ది రోజుల క్రితం టైఫాయిడ్‌ జ్వరం వచ్చింది. తాజాగా భార్య, అత్తకు జ్వరం రావడంతో, కరోనా అయివుండొచ్చుననే భయం వారిని వెంటాడింది. శుక్రవారం సొంత ఊరికి వెళ్లి అందరు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

కరోనా విలయం కొనసాగుతున్న వేళ అనవసర భయాలు ఇప్పుడు బలవన్మరణాలకు కారణమవుతున్నాయి. కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణైతే చాలు ఇక ఏమైపోతామోనన్న ఆందోళన, బతుకు మీద నైరాశ్యం, వైద్య ఖర్చులపై బెంగ,ఆసుపత్రిలో పడక, ఆక్సిజన్‌ లభిస్తుందో లేదోనన్న భయాలు మనిషిని నీడలా వెంటాడుతున్నాయి.వీటికి తోడు చికిత్స సమయంలో ఒంటరితనం, మానసిక కుంగుబాటు ఇలా అనేక అంశాలు కరోనా బాధితుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి

నిపుణులేమంటున్నారు…? ఇటీవల ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో కూడా కొంతమంది ఆసుపత్రి భవనాలపై నుంచి దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. వారిలో ఒంటరితనం, చుట్టూ తమ వాళ్లు ఎవరూ లేరన్న ఆందోళనలే దీనికి కారణమని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇంతకు ముందు అనారోగ్యంతో అసుపత్రిలో చేరితే రోగి కుటుంబ సభ్యులో, స్నేహితులో ఎవరో ఒకరు దగ్గర ఉండేవారు. దీంతో రోగి ఆత్మస్థైర్యం పెరిగి త్యరగా కోలుకోవడానికి దోహదపడేది. కానీ కరోనా మహమ్మారితో ఆసుపత్రులలో చేరినవారి పక్కన కూడా ఎవరూ ఉండటానికి వీల్లేని దుస్థితి నెలకొంది. చికిత్స సమయంలో పక్కనున్న ఇతర రోగులలో ఎవరి పరిస్థితైనా ఆందోళనకంగా ఉంటే వారిని చూసి ఇతర రోగులలో మరింత భయాలు కలుగుతున్నాయి. ఇది తీవ్ర కుంగుబాటుగా మారి, అది భరించలేక ప్రాణాలు తీసుకోవడం లేదా “హార్ట్‌ ఎటాక్‌” లాంటివి తెచ్చుకుంటున్నారు.

వైద్య ఖర్చులకు భయపడి కొందరు.. కరోనా సోకిన మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారిలో కొంతమంది అసుపత్రుల ఖర్చులకు భయపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో బెడ్లు దొరకవు. దొరికినా అక్కడ నాణ్యమైన వైద్యంపై సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే లక్షల రూపాయల బిల్లులు ఎలా కట్టాలనే ఆందోళన వారిని నిలకడగా ఉండనివ్వడం లేదు. తన వల్ల కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు పడకూడదనే ఆలోచనలు కనీసం తాను ఆత్మహత్య చేసుకుంటే కుటుంబమైనా ఆర్ధిక ఇబ్బందులు పడకుండా ఉంటుందని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ధైర్యం కలిగించాలి… కరోనా వచ్చిన వారిని దోషులుగా, వెలివేసినట్లుగా చూసే సంఘ దృష్టి మారాలి. కరోనా బారిన పడిన వారికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతోపాటు, ఇరుగు పొరుగువారు కూడా అండగా నిలవాలి. నిరంతరం వారితో మాట్లాడుతూ సానుకూల దృక్పధం పెంచే మాటలు చెప్పాలి. కరోనా బారిన పడిన వారికి ఆరోగ్య, ఆహార, ఆర్ధిక విషయాలలో భరోసా నివ్వాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఆందోళన పెంచే సమాచారాలకు రోగులను దూరంగా ఉంచాలి.

Mickey Mouse: టాప్ కార్టూన్ క్యారెక్టర్ మిక్కీ మౌస్  మొదట పేరు ఏమిటో తెలుసా? అసలు మిక్కీ మౌస్ ఎలా తెరమీదకు వచ్చిందంటే..

Pan-India star Prabhas: ప్రశాంత్ నీల్ ప్లాన్ మాములుగా లేదుగా.. ‘సలార్’లో ప్రభాస్ అలా కనిపించనున్నాడట..

Fact Check: పెన్నుతో చెక్ చేసిన ఆక్సిజ‌న్ శాతం చూపిస్తోంది.. అస‌లు ఆక్సీమీట‌ర్లు ప‌నిచేస్తున్నాయా.? నిజ‌మేంటంటే..