Mickey Mouse: టాప్ కార్టూన్ క్యారెక్టర్ మిక్కీ మౌస్ మొదట పేరు ఏమిటో తెలుసా? అసలు మిక్కీ మౌస్ ఎలా తెరమీదకు వచ్చిందంటే..
Mickey Mouse: కార్టూన్ సినిమాలు అంటే పిల్లలు తెగ ఇష్టపడతారు. కొంతమంది పెద్దవాళ్ళూ కార్టూన్ సినిమాలపై మోజు పడతారనుకోండి. అయితే, కార్టూన్ సినిమాలను ఇష్టపడినా.. పడకపోయినా డిస్నీ మిక్కీ మౌస్ ను ఇష్టపడని వారుండరు.
Mickey Mouse: కార్టూన్ సినిమాలు అంటే పిల్లలు తెగ ఇష్టపడతారు. కొంతమంది పెద్దవాళ్ళూ కార్టూన్ సినిమాలపై మోజు పడతారనుకోండి. అయితే, కార్టూన్ సినిమాలను ఇష్టపడినా.. పడకపోయినా డిస్నీ మిక్కీ మౌస్ ను ఇష్టపడని వారుండరు. పిల్లలనే కాదు.. కార్టూన్ సినిమాలు ఇష్టపడని వారు కూడా మిక్కీమౌస్ అంటే పడి చచ్చిపోతారనడం అతిశయోక్తి కాదు. మిక్కీ మౌస్ కి ఉన్నక్రేజ్ అటువంటింది. ఇప్పుడు ఇది ఎందుకంటే..1928లో సరిగ్గా ఇదేరోజు (మే15)న పిల్లల అభిమాన కార్టూన్ పాత్ర మిక్కీ మౌస్ మొదటిసారి తెరమీదకు వచ్చింది. డిస్నీ ఇదేరోజు తన ‘ప్లెయిన్ క్రేజీ’ షార్ట్ ఫిలిం మిక్కీ మౌస్ ప్రధాన పాత్రగా విడుదల చేశారు. ఆరు నిమిషాల ఈ చిన్న సినిమాలో..మిక్కీ తొ పాటు మిన్నీ అలాగే ఇతర పాత్రలు విమాన ప్రయాణం చేస్తాయి. దీని తరువాత డిస్నీ..గలోపిన్ గౌచో’ అనే మరో చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ఈ రెండు సినిమాలూ మూకీ సినిమాలు. అయితే, ఈ సినిమాలు పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. కానీ, అదే సంవత్సరం అక్టోబర్ 1న డిస్నీ ‘స్టీమ్‌బోట్ విల్లీ’ అనే సినిమాని..విడుదల చేశారు. ఇది టాకీ సినిమా. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. రెండువారాల పాటు ఈ సినిమా దియేటర్లలో నడిచింది. అప్పట్లో ఇది రికార్డ్. ఈ సినిమా వెయ్యి డాలర్లు డిస్నీకి సంపాదించిపెట్టింది. ఇక ఈ సినిమా తరువాత డిస్నీ వెనుతిరిగి చూసే అవసరం రాలేదు. అందుకే డిస్నీసినిమా అక్టోబర్ 1 వ తేదీని మిక్కీ మౌస్ పుట్టినరోజుగా జరుపుకుంటుంది. మిక్కీ మౌస్ ఆలోచన ఎలా వచ్చింది?
ఒక రోజు వాల్ట్ డిస్నీ తన డెస్క్ వద్ద కూర్చున్నప్పుడు, అతను ఒక ఎలుకను చూశాడు. అది అక్కడ చేస్తున్న అల్లరి చూశాడు. దానిని చూస్తుంటే, అతనికి సరదాగా అనిపించింది. దీంతో వాల్ట్ డిస్నీ ఆ ఎలుకను ఫన్నీగా చూపిస్తూ ఓ బొమ్మ గీశాడు. దానికి కడుపు పెద్దగా..చెవులు చిన్నగా పెట్టి.. డ్రస్ వేశాడు. అలాగే చేతులకు గ్లౌస్.. కాళ్ళకు షూస్.. తగిలించి ఆ బొమ్మ గీశాడు. దీనికి మోర్టిమెర్ అని పేరుపెట్టాడు. అయితే, డిస్నీ భార్యకు ఈ పేరు నచ్చలేదు. ఆమె మిక్కీ అని పేరును సూచించింది. ఇక ఆ పేరే దానికి స్థిరపడిపోయింది.
ఇక తన మూడో సినిమా విజయవంతం అయిన తరువాత, డిస్నీ వెనుతిరిగి చూడలేదు. వాల్ట్ మిక్కీ మౌస్(Mickey Mouse) క్లబ్, చిల్డ్రన్ కోసం ఫ్యాన్ క్లబ్ అనే రెండు సంస్థలను ప్రారంభించాడు. మిక్కీ స్నేహితుడిగా నటించిన మిన్నీతో సహా డిస్నీ అనేక పాత్రలు సిద్ధం చేసింది. మొదటి చిత్రంలో మిక్కీ స్నేహితురాలు మిన్నీ. తర్వాత గూఫీ, ప్లూటో, డోనాల్డ్ డక్ కూడా వచ్చారు, ఇవన్నీ ప్రజాదరణ పొందింది.
ప్రపంచంలో అతిపెద్ద బ్రాండ్లలో డిస్నీ ఒకటి
మిక్కీ మౌస్(Mickey Mouse)లో ఇప్పటివరకు 22 లఘు చిత్రాలు, 11 సినిమాలు, 6 కార్టూన్ సిరీస్‌లు విడుదలయ్యాయి. 2020 లో వాల్ట్ డిస్నీ ప్రపంచ ఆదాయం. 38.7 బిలియన్. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌లో డిస్నీ 7 వ స్థానంలో ఉంది. ఫోర్బ్స్ ప్రకారం, దాని బ్రాండ్ విలువ .3 61.3 బిలియన్లు. డిస్నీ మీడియా బిజినెస్ నెట్‌వర్క్‌లో డిస్నీ ఛానల్, ఇఎస్‌పిఎన్, హిస్టరీ, లైఫ్‌టైమ్ వంటి అనేక ఛానెల్‌లు ఉన్నాయి. డిస్నీ హాట్ స్టార్ 8 మిలియన్ల వినియోగదారులతో భారతదేశపు అతిపెద్ద OTT ప్లాట్‌ఫాం.