Mega Prince Varun Tej : వరుణ్ తేజ్ సినిమాకూడా వెనక్కు వెళ్లనుందా.. ‘గని’ సినిమాను వాయిదా వేయనున్నారా..?

మెగాహీరో వరుణ్ తేజ్ 'ముకుంద' సినిమాతో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు వరుణ్.

Mega Prince Varun Tej : వరుణ్ తేజ్ సినిమాకూడా వెనక్కు వెళ్లనుందా.. 'గని' సినిమాను వాయిదా వేయనున్నారా..?
Follow us
Rajeev Rayala

|

Updated on: May 15, 2021 | 6:41 PM

Mega Prince Varun Tej : మెగాహీరో వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు. టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు వరుణ్. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్3 సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. అలాగే కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘గని’ అనే ఇంటరెస్టింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. సినిమా కోసం బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు ఈ మెగా హీరో. అయితే  బాక్సింగ్ లో శిక్షణ కోసం విదేశాలకు వెళ్లడం.. ఆ తరువాత కరోనా కారణంగా లాక్ డౌన్  విధించడంతో షూటింగ్ వాయిదా పడింది. దాంతో ఈ సినిమా ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే ఈ సినిమాను ఎలాగైనా అనుకున్న సమయానికి పూర్తి చేయాలని ఇటీవల తిరిగి షూటింగ్ ను మొదలు పెట్టి శరవేగంగా షూటింగ్ జరిపారు. కొంత భాగం షూటింగ్ జరపగానే కరోనా సెకండ్ వేవ్ ఎంట్రీ ఇచ్చింది. దాంతో మళ్లీ షూటింగ్ కు బ్రేక్ పడింది.

అయితే ఈ సినిమాను జూలై 30వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ముందుగానే ప్రకటించారు మేకర్స్. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ అయ్యేలా కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడటం ఖాయమేనని చెప్పుకుంటున్నారు. కానీ అలాంటిదేం జరగదని దర్శకుడు కిరణ్ కొర్రపాటి అంటున్నారు.  సినిమాను అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ధీమాగా ఉన్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాతో సయీ మంజ్రేకర్  తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

కొలిక్కిరాని ‘ఇండియన్ 2’ వివాదం.. శంకర్ మూవీ గొడవలో మరో మలుపు.. మరోసారి డైరెక్టర్‏కు షాకిచ్చిన నిర్మాణ సంస్థ..

మూడు సంవత్సరాల వయసులో నేర్చుకున్న నాట్యం.. తన జీవితాన్నే మార్చేసింది.. మాధురి దీక్షిత్ గురించి ఆసక్తికర విషయాలు..

Faria Abdullah: డాన్స్ తో అదరగొట్టిన చిట్టి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫారియా స్టెప్పులు…

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే