AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేకర్స్‏ను ఇరకాటంలో పెడుతున్న సోనూసూద్ ఇమేజ్… దర్శకనిర్మాతలకు తలనొప్పిగా మారిన రియల్ హీరో రోల్..

SonuSood: రీల్ లైఫ్ లో విలన్ పాత్రలు చేసే ఆ నటుడు రియల్ లైఫ్ లో మాత్రం హీరో అయ్యాడు. కరోనా భారత్ ను కమ్మేసిన వేళ....నేనున్నానంటూ కదిలాడు.

మేకర్స్‏ను ఇరకాటంలో పెడుతున్న సోనూసూద్ ఇమేజ్... దర్శకనిర్మాతలకు తలనొప్పిగా మారిన రియల్ హీరో రోల్..
Sonusood
Rajitha Chanti
|

Updated on: May 15, 2021 | 2:35 PM

Share

SonuSood: రీల్ లైఫ్ లో విలన్ పాత్రలు చేసే ఆ నటుడు రియల్ లైఫ్ లో మాత్రం హీరో అయ్యాడు. కరోనా భారత్ ను కమ్మేసిన వేళ….నేనున్నానంటూ కదిలాడు. ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా అక్కడ వాలిపోతున్నాడు. అడిగిన వెంటనే కాదనకుండా సాయం చేస్తూ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచాడు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఇప్పుడు అంతా ఆయన వైపే చూస్తున్నారు. సోనూ బాయ్ అంటే…సాయం చేసే గాడ్ అని కొలుస్తున్నారు.

సోనూసూద్‌.. ఎవరికీ ఏ అవసరం వచ్చినా గుర్తొస్తున్న పేరు. దేశమంతా ఇప్పుడు ఆయన ఒక్కడే కనిపిస్తున్నాడు. కరోనా ఫస్ట్ వేవ్ లో కష్టాలు పడుతున్న పేదలను చూసి సేవకుడిగా బయలుదేరాడు. లాక్‌ డౌన్‌ టైమ్‌లో ఇండస్ట్రీ షట్‌డౌన్‌ అయి స్టార్స్ అంతా ఖాళీగా ఉంటే… సోనూసూద్ మాత్రం ఫుల్ బిజీ అయ్యారు. మొదటి వేవ్‌ టైమ్‌లో వేల మంది వలస కార్మికులకు సాయం చేసిన సోనూ… రియల్ హీరో అనిపించుకున్నారు. సెకండ్ వేవ్‌లో సేవ కార్యక్రమాల్లో మరింత బిజీ అయ్యారు. అడిగిన వారంద‌రికి సొంత ఖర్చులతో సాయాలు చేసుకుంటూ వెళుతున్నాడు. సోనూ సూద్ పీఎం కావాలన్న డిమాండ్ కూడా మొదలైంది. అయితే సోనూ మాత్రం తనకు సామాన్యుడిగా సాయం చేయటమే ఇష్టమంటూ చెప్పారు. పదవుల మీద ఆశలేదు.. సాయం చేయటం నాకు ఇష్టం అంటూ సైలెంట్‌గా సైడయ్యారు. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్‌, మెడిసిన్ అందక కష్టాలు పడుతున్న వారికి తనవంతు సాయం అందిస్తున్నారు ఈ రియల్‌ హీరో. సామాన్యులే కాదు… సెలబ్రిటీలు కూడా సోనూ వల్ల సాయం పొందుతున్నారు. అలా ఎందరో ప్రాణాలు కాపాడిన సోనూసూద్‌ను దేవుడితో పోలుస్తున్నారు ప్రజలు. ఆయన సేవలు పొందిన వారు ఎంతోమంది సోనూ ఫోటో పెట్టుకొని పూజిస్తున్నారు. తమ పిల్లలకు సోనూసూద్ అని పేరు పెట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఈ సేవా కార్యక్రమాలతో సోనూ ఇమేజ్‌ తారాస్థాయికి చేరింది. దీంతో ఇన్నాళ్లు నెగెటివ్ రోల్స్‌ చేసిన ఈ టాలెంటెడ్ స్టార్‌ని ఇప్పుడు విలన్‌గా చూపించేందుకు కూడా భయపడుతున్నారు మేకర్స్‌. జనాల్లో రియల్‌ హీరో ఇమేజ్‌ ఉన్న నటుడు తెర మీద విలన్‌లా కనిపిస్తే యాక్సెప్ట్ చేయరేమో అని భయపడుతున్నారట.

Also Read: కొలిక్కిరాని ‘ఇండియన్ 2’ వివాదం.. శంకర్ మూవీ గొడవలో మరో మలుపు.. మరోసారి డైరెక్టర్‏కు షాకిచ్చిన నిర్మాణ సంస్థ..

Ram Pothineni: దేవదాసుగా ఎంట్రీ ఇచ్చి ఎనర్జిటిక్ స్టార్‏గా మారిన రామ్.. రాపో సినీ ప్రస్థానం..

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!