శ్రావణమాసం… శుభ పరిణామం: ఎంపీ బండి సంజయ్
కేంద్రం నిర్ణయం పట్ల దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఒకే దేశం.. ఒకే రాజ్యమనే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలలు నేడు నెరవేరుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేయాలని దేశ ప్రజలంతా కోరుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంలో బీజేపీ మానిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చడం జరిగిందని గుర్తుచేశారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమనే విషయాన్ని కూడా బీజేపీ స్పష్టం చేసిందన్నారు. కశ్మీర్ ఎవరి జాగీరు […]
కేంద్రం నిర్ణయం పట్ల దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఒకే దేశం.. ఒకే రాజ్యమనే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలలు నేడు నెరవేరుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేయాలని దేశ ప్రజలంతా కోరుకున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంలో బీజేపీ మానిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చడం జరిగిందని గుర్తుచేశారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమనే విషయాన్ని కూడా బీజేపీ స్పష్టం చేసిందన్నారు. కశ్మీర్ ఎవరి జాగీరు కాదని, కశ్మీర్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన పార్టీలు సిగ్గుతో తలదించుకోవాలంటూ ఎంపీ సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ధ్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని విమర్శించారు. కశ్మీర్.. భారత్‌లో అంతర్భాగమో కాదో బిల్లును వ్యతిరేకించిన పార్టీలు చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రావణమాసం సోమవారం మంచి పరిణామమని… కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పండుగ వాతావరణం ఉందని సంజయ్ పేర్కొన్నారు.