బీజేపీ చారిత్రక నిర్ణయం.. ఆర్టికల్ 370 రద్దుకు ముందు.. తర్వాత..!
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు కావడంతో దేశ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగింది. మెజార్టీ ప్రజలు ఆర్టికల్ 370 రద్దును స్వాగతిస్తుంటే.. కొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఆర్టికల్ 370 రద్దు కావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? రద్దుకు ముందు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే దాన్ని పరిశీలిస్తే.. ఆర్టికల్ 370 ప్రకారం.. జమ్మూకశ్మీర్ పౌరులకు ఇప్పటివరకూ ద్వంద్వ పౌరసత్వం ఉంది. కానీ ఈ ఆర్టికల్ రద్దుతో అందరికీ ఒకే పౌరసత్వం […]
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు కావడంతో దేశ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేగింది. మెజార్టీ ప్రజలు ఆర్టికల్ 370 రద్దును స్వాగతిస్తుంటే.. కొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఆర్టికల్ 370 రద్దు కావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి..? రద్దుకు ముందు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే దాన్ని పరిశీలిస్తే..
ఆర్టికల్ 370 ప్రకారం.. జమ్మూకశ్మీర్ పౌరులకు ఇప్పటివరకూ ద్వంద్వ పౌరసత్వం ఉంది. కానీ ఈ ఆర్టికల్ రద్దుతో అందరికీ ఒకే పౌరసత్వం వర్తించనుంది. ఇక ఇప్పటివరకు జమ్ముకశ్మీర్ జాతీయ పతాకం భిన్నంగా ఉండేది. ఇప్పడు భారతదేశ పతాకమే జమ్ముకశ్మీర్‌కు వర్తిస్తుంది. ఇప్పటివరకూ ఆరేళ్లు ఉన్న శాసనసభ్యుల పదవీకాలం.. రద్దుతో ఐదేళ్లకు చేరింది. అంతేకాదు ఇప్పటినుంచి భారత పార్లమెంట్ చట్టాలన్నీ జమ్ముకశ్మీర్‌లో కూడా అమలుకానున్నాయి. గతంలో సుప్రీంకోర్టు తీర్పు అక్కడ చెల్లుబాటు అయ్యేది కాదు. ఇప్పటినుంచి నుంచి భారత సుప్రీంకోర్టు ఆదేశం చెల్లుబాటు కానుంది. తలాక్ చట్టం కూడా అమలు కానుంది. ఆర్టికల్ 370 రద్దు ముందు వరకు భారతీయులకు కశ్మీర్‌లో భూమిని కొనే హక్కులేదు. రద్దుతో భారతీయులకు కూడా కశ్మీర్‌లో భూమిని కొనే అవకాశం ఏర్పడింది. అంతేకాదు ఇతరులకు కూడా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ఇప్పుడు ఒక కశ్మీరి మహిళ ఇతర రాష్ట్రంలోని వ్యక్తిని పెళ్లి చేసుకునే పౌరసత్వం వారికి వర్తిస్తుంది.