రాజ్యసభలో అమిత్‌షా అణుబాంబు పేల్చారు – ఆజాద్

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన అధికరణ 370ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రతిపాదించిన బిల్లుపై రాజ్యసభలో జరిగిన వాడీవేడి చర్చలో గులాం నబీ ఆజాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజాద్‌ మాట్లాడుతూ.. ‘‘ఓటు బ్యాంకు రాజకీయాలను మేం సహించం. రాజ్యాగంలోని అధికరణ 370 రద్దుతో 35ఏ, బి, నిబంధనలు కూడా రద్దయ్యాయి. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారు. జమ్ముకశ్మీర్‌ భౌగోళికతనే ప్రశ్నార్థకం చేశారు. సున్నితమైన సరిహద్దులు జమ్ముకశ్మీర్‌తోనే ముడిపడి ఉన్నాయి. ఎన్డీయే […]

  • Tv9 Telugu
  • Publish Date - 3:12 pm, Mon, 5 August 19
రాజ్యసభలో అమిత్‌షా అణుబాంబు పేల్చారు – ఆజాద్

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన అధికరణ 370ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రతిపాదించిన బిల్లుపై రాజ్యసభలో జరిగిన వాడీవేడి చర్చలో గులాం నబీ ఆజాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆజాద్‌ మాట్లాడుతూ.. ‘‘ఓటు బ్యాంకు రాజకీయాలను మేం సహించం. రాజ్యాగంలోని అధికరణ 370 రద్దుతో 35ఏ, బి, నిబంధనలు కూడా రద్దయ్యాయి. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారు. జమ్ముకశ్మీర్‌ భౌగోళికతనే ప్రశ్నార్థకం చేశారు. సున్నితమైన సరిహద్దులు జమ్ముకశ్మీర్‌తోనే ముడిపడి ఉన్నాయి. ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయాలు జమ్ముకశ్మీర్‌ను సంక్షోభంలోకి నెట్టేలా ఉన్నాయి. 370 రద్దువల్ల జమ్ముకశ్మీర్‌ను ఆర్థికంగా, సామాజికంగా ఖూనీ చేశారు. అన్ని రాజకీయ పార్టీలూ ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయంపై పోరాడాలి’’అని విజ్ఞప్తి చేశారు.

‘‘కశ్మీర్‌ను ముక్కలు చేయడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నిర్ణయంతో  కేంద్రమంత్రి  అమిత్‌ షా కశ్మీర్‌పై అణుబాంబు వేశారు. పెద్ద సంఖ్యలో పారా మిలటరీ బలగాలను జమ్ముకశ్మీర్‌కు తరలించారు. అమర్‌నాథ్‌ యాత్రికులను భయపెట్టి వెనక్కి పంపారు. కేంద్ర విద్యా సంస్థలను మూసివేసి విద్యార్థులను ఎక్కడివారిని అక్కడికి పంపారు. పోలీస్‌, , వైద్య, తదితర శాఖల్లో సెలవులు రద్దుచేశారు’ అని విమర్శించారు.