సిక్కుల ఊచకోత కేసు.. దోషికి బెయిల్ నిరాకరణ

1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో దోషి సజ్జన్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఢిల్లీ కోర్టు విధించిన జీవిత ఖైదును సవాలు చేయడంతో పాటు బెయిల్ కోరుతూ కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. అయితే శిక్ష పై మధ్యంతర ఉపశమనం ఇవ్వలేమని.. పిటిషన్ ను వచ్చే వేసవి సెలవుల్లో వింటామని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇందిరాగాంధీ హత్య తరువాత చోటుచేసుకున్న ఈ ఊచకోతలో 3వేల మందికి […]

సిక్కుల ఊచకోత కేసు.. దోషికి బెయిల్ నిరాకరణ
Follow us

| Edited By:

Updated on: Aug 05, 2019 | 3:13 PM

1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో దోషి సజ్జన్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఢిల్లీ కోర్టు విధించిన జీవిత ఖైదును సవాలు చేయడంతో పాటు బెయిల్ కోరుతూ కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. అయితే శిక్ష పై మధ్యంతర ఉపశమనం ఇవ్వలేమని.. పిటిషన్ ను వచ్చే వేసవి సెలవుల్లో వింటామని సుప్రీం కోర్టు పేర్కొంది. ఇందిరాగాంధీ హత్య తరువాత చోటుచేసుకున్న ఈ ఊచకోతలో 3వేల మందికి పైగా సిక్కులు ప్రాణాలు కోల్పోయారు.