హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్‌: గత కొంతకాలంగా డ్రగ్స్ విషయంలో సీరియస్‌గా కాన్సన్‌ట్రేట్ హైదరాబాద్‌లో పోలీసులు మరోసారి భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో నేరెడ్‌మెట్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ముఠా పట్టుబడింది. నలుగురు నిందితులను అదపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుల నుంచి భారీగా కొకైన్‌, హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు […]

  • Ram Naramaneni
  • Publish Date - 12:10 pm, Wed, 13 March 19
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాద్‌: గత కొంతకాలంగా డ్రగ్స్ విషయంలో సీరియస్‌గా కాన్సన్‌ట్రేట్ హైదరాబాద్‌లో పోలీసులు మరోసారి భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో నేరెడ్‌మెట్‌ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ముఠా పట్టుబడింది. నలుగురు నిందితులను అదపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితుల నుంచి భారీగా కొకైన్‌, హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో గత కొంతకాలంగా ఈ ముఠా వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి కొకైన్‌, హెరాయిన్‌ను వీరు విక్రయిస్తున్నారు.