పట్టించుకోకుండా సీరియల్స్ చూస్తోందని రాడ్డుతో కొట్టిన భర్త

సాయంత్రమయ్యేసరికి టీవీలకు అతుక్కుపోతారు ఆడవాళ్లు. ఏ ఛానెల్ మార్చినా సీరియల్స్‌నే. సాధారణంగా పొయ్యి మీద పప్పులు, అన్నం పెట్టి మర్చిపోతారుకూడా.. అలాగే.. చాలా మంది మగవాళ్లు తమని పట్టించుకోకుండా సీరియల్స్ చూస్తోందని చెప్పే మగవాళ్లు కూడా ఉన్నారు. కాగా.. మహారాష్ట్రలో ఒక ఘోర సంఘటన చోటుచేసుకుంది. తనను పట్టించుకోకుండా సీరియల్స్ చూస్తోందని భర్త ఏకంగా రాడ్డుతో భార్యపై దాడి చేశాడు. పూణేలోని సాలిస్ బరిలో వుండే అసిఫ్ సత్తార్ హోర్డింగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు […]

పట్టించుకోకుండా సీరియల్స్ చూస్తోందని రాడ్డుతో కొట్టిన భర్త

సాయంత్రమయ్యేసరికి టీవీలకు అతుక్కుపోతారు ఆడవాళ్లు. ఏ ఛానెల్ మార్చినా సీరియల్స్‌నే. సాధారణంగా పొయ్యి మీద పప్పులు, అన్నం పెట్టి మర్చిపోతారుకూడా.. అలాగే.. చాలా మంది మగవాళ్లు తమని పట్టించుకోకుండా సీరియల్స్ చూస్తోందని చెప్పే మగవాళ్లు కూడా ఉన్నారు. కాగా.. మహారాష్ట్రలో ఒక ఘోర సంఘటన చోటుచేసుకుంది. తనను పట్టించుకోకుండా సీరియల్స్ చూస్తోందని భర్త ఏకంగా రాడ్డుతో భార్యపై దాడి చేశాడు.

పూణేలోని సాలిస్ బరిలో వుండే అసిఫ్ సత్తార్ హోర్డింగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు లీకైన పాల ప్యాకెట్ తీసుకురావడంతో ఆ మహిళ పిల్లాడిని కసురుకుంది. దీంతో భర్త భార్యను మందలించింది. దీంతో అలిగిన ఆమె.. ఇంట్లోకి వెళ్లి పడుకుంది. పనికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చినప్పటికీ సత్తార్ ను ఆమె పట్టించుకోకుండా సీరియల్స్ చూస్తు ఉంది. దీంతో విసుగుచెందిన భర్త పక్కనే ఉన్న రాడ్డుతో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య కుడిచేతికి గాయమైంది. కాగా.. తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని పోలీసులకు కంప్లైట్ ఇచ్చింది. దీంతో సత్తార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Click on your DTH Provider to Add TV9 Telugu